Featured

Balagam Mogilayya : చావు బతుకుల మధ్య బలగం మొగిలయ్య… మమల్ని ఆదుకోండి అంటూ…!

Balagam Mogilayya : తెలంగాణ పల్లె వాతావరణం, సంస్కృతిని సహజంగా చూపించి సక్సెస్ అయ్యాడు దర్శకుడు వేణు. ఒక మనిషి చనిపోయినపుడు ఇంట్లోని కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుంది ఎలా ఫీల్ అవుతారు లాంటి విషయాలను చాలా సునిశితంగా చూపించారు. బలగం సినిమా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని కాకుండా దేశ విదేశాలలో చాలా మందికి నచ్చుతోంది. ఇక తెలంగాణ పల్లెల్లో అయితే గ్రామంలో అందరూ కలిసి సినిమా చూస్తూ ఎమోషనల్ అవుతున్నారు. అంతలా సినిమా అందరికీ కనెక్ట్ అయి ఆర్టిస్టులకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఎన్నో ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నా కూడా అంతగా రాని గుర్తింపు ఈ ఒక్క సినిమాతో చాలా మంది ఆర్టిస్టులకు వచ్చింది. అలా మొగిలయ్య కొమరమ్మ లకు ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు వచ్చింది.

అనారోగ్యంతో బాధపడుతున్న మొగిలయ్య…

బలగం సినిమా అంతా ఒకెత్తయితే చివర్లో వచ్చే పాట చూసిన ప్రేక్షకులందరినీ కంట తడి పెట్టించింది. సినిమా క్లైమాక్స్ లో ఆ పాటలో లీనమైపోతాం. మనకు తెలియకుండానే ఆ పాటకు కనెక్ట్ అయి మన కుటుంబం గుర్తొస్తుంది. అంత అద్భుతంగా పాట పాడిన కళాకారులు మొగిలయ్య, కొమరమ్మ లకు అందరూ ఫిదా అయ్యారు. ఎక్కడ బాలగం సక్సెస్ మీట్ జరిగినా అక్కడ వారి ప్రస్తావన ఉంటోంది. ఆ పాట వల్ల తగాదాలు పడుతూ వేరుగా ఉంటోన్న కొన్ని కుటుంబాలు కలిసిపోవడం కూడా జరిగింది. అలాంటి పాట పాడిన మొగిలయ్య కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నాడు.

డయాలసిస్ ఖచ్చితంగా జరిపించాలి, అందుకు అతని ఆర్థిక పరిస్థితి చాలదు. బలగం సినిమా తరువాత కొంతమంది ప్రముఖులు ముందుకు వచ్చి ఆయనకు సహాయం చేస్తున్నా వైద్యంకి అయ్యే ఖర్చు వల్ల మరింతమంది తనకు చేయూత ఇవ్వాలంటూ మొగిలయ్య ఆసుపత్రి బెడ్ మీద నుండే కోరుకుంటున్నాడు. ప్రస్తుతం కొంతమంది రాజకీయ ప్రముఖులు కూడా మొగిలియ్యను బ్రతికుంచుకోవడానికి ఆర్థిక సహాయం అందిస్తున్నారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago