Featured

Analyst Damu Balaji : జగన్ ఒక చేతకాని సీఎం… రూటు మార్చిన శ్రీరెడ్డి… కారణం అదే…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : తెలుగులో శ్రీ రెడ్డి అంటే తెలియని వాళ్ళు ఉండరు. సినిమాల్లో కనిపించకపోయినా సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ ట్రెండింగ్ లో ఉంటోంది. ఈమె ఏ సెలబ్రిటీ గురించి ఏం మాట్లాడుతుందో అన్న భయం సినిమా ప్రముఖుల్లో మొదలైంది. క్యాస్టింగ్ కౌచ్ గురించి ఈమె ఏకంగా ఫిలిం ఛాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేసి దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది. గత కొన్నిరోజులుగా శ్రీ రెడ్డి తన మకాం హైదరాబాద్ నుండి తమిళనాడుకి మార్చేసింది. ఈమధ్యనే ఒక వీడియోలో తాను ఎందుకు హైదరాబాద్ వదిలి చెన్నై వెళ్లాల్సి వచ్చిందో కూడా చెప్పింది. ఇక్కడ ఇండస్ట్రీలోని పెద్ద కుటుంబాల వాళ్ళు తనకు అవకాశాలు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించింది. సినిమాల్లో కానీ టీవీ రంగంలో కానీ ఎక్కడా తనకు అవకాశాలు రాకుండా అడ్డుకుంటూ ఉండటంతో చెన్నై వెళ్లి యూట్యూబ్ ఛానల్ ద్వారా సంపాదించుకుంటున్నానని చెప్పింది. ఇక ఈ మధ్యనే మళ్ళీ తెలుగు సోషల్మీడియాలో ఎక్కువగా ఆక్టివ్ గా ఉంటూ వైసీపీ పార్టీ తరుపున ప్రచారంను నెత్తిన వేసుకుంది. అయితే తాజాగా శ్రీరెడ్డి జగన్ మీద చేసిన వాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

జగన్ చేతకాని సీఎం…

తాజాగా వచ్చిన మించోంగ్ తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతులను, ప్రజలతో మాట్లాడటానికి వెళ్లిన సీఎం జగన్ అక్కడ వారి నుండి దూరంగా బ్యారికేడ్లను అడ్డుగా ఉంచి మాట్లాడటం బాగా వైరల్ అయింది. ఈ ఇష్యూ మీద ఇప్పటికే ప్రతిపక్షం అయిన టీడీపీ విమర్శలను కూడా చేసింది. అయితే తాజాగా శ్రీరెడ్డి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అందులో పంజరంలో ఉండి కాదు బయట జనంలోకి వచ్చి మాట్లాడు అంటూ చెప్పిన మాటలను ఇపుడు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నవాళ్లందరూ సీఎం జగన్ కి ఆ మాటలను ఆపాదిస్తున్నారు.

నిజానికి ఆ వీడియోలో శ్రీరెడ్డి ఎక్కడా జగన్ పేరు ప్రస్థావించలేదు. పైగా అది కొత్త వీడియో కాకపోవడం గమనర్హం అంటూ బాలాజీ తెలిపారు. నిజానికి శ్రీరెడ్డి తాజాగా కూడా వైసీపీ కి సపోర్ట్ చెస్తున్న వీడియోలను చేస్తోంది. అయితే ఎప్పుడో మాట్లాడిన పాత వీడియోని మళ్ళీ కొంతమంది వైరల్ చేస్తూ దాన్ని జగన్ కి రిలేట్ చేస్తున్నారని బాలాజీ అభిప్రాయాపడ్డారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక డీప్ ఫేక్ వీడియోలు ఎక్కువవడం వల్ల నిజమేదో ఫేక్ ఏదో తెలుసుకోలేక పోతున్నామని బాలాజీ అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago