Vakkantham Vamsi : తెలుగు సినీ అభిమానులకు రచయితగా, దర్శకుడిగా వక్కంతం వంశీ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఈటీవీలో మొదట వ్యాఖ్యతగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన వంశీ 1996లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ‘కల్యాణ ప్రాప్తిరస్తు’ సినిమాలో హీరోగా నటించాడు. తరువాత కొన్ని సీరియల్స్ లో కూడా నటించాడు. ఇక ఎన్టీఆర్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘అశోక్’ సినిమాతో మొదటిసారి రచయితగా చేసాడు. తరువాత వచ్చిన ‘కిక్’ సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నాడు. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాకు కథను అందించడమే కాకుండా దర్శకత్వం వహించారు. తన సినిమాల గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఆయన పంచుకున్నారు.
నా సినిమా కథలని కాపీ కొట్టాను అన్నారు…
వక్కంతం వంశీ చాలా సినిమాలకు కథలు అందించినా, చాలా దర్శకుల దగ్గర చేసినప్పటికీ ఎక్కువగా సురేందర్ రెడ్డి సినిమాలకు కథలను అందించడం విశేషం. వక్కంతం వంశీ మొదట్లో తన కథల మీద చాలా విమర్శలు వచ్చేవని, ఇంగ్లీష్ సినిమా కథలను పోలి ఉంటాయని అనేవారని, మొదట్లో అది కొంచం బాధించినా తరువాత వదిలేశానని ఆయన చెప్పారు. ఇక కిక్ సినిమా కథను జెంటిల్ మాన్, ధూమ్ సినిమా కథలను పోలి ఉందని కూడా అన్నారు. ఎవడు సినిమా కూడా ఇంగ్లీష్ సినిమా కథను కాపీ కొట్టానని అన్నారు.
నేను ఏ కథనూ కాపీ కొట్టలేదు, ఇప్పుడు నేను కొత్తగా చెప్పి నిరూపించలేను. ధూమ్ సినిమాను చూసి జెంటిల్ మాన్ సినిమా అనికూడా అనుకోవచ్చు. కొత్తగా కథలను ఎవరూ సృష్టించలేరు కదా, ప్రపంచంలో ఎక్కడో ఒకచోట ఉన్నవే మనం ఊహించగలం అని చెప్పుకొచ్చారు. ఇక రేసు గుర్రం సినిమా గురించి మాట్లాడుతూ అది అసలు కొత్త కథ కాదు, నేనేదో అద్భుతం ఊహించి రాసినది కాదు, మనందరికీ తెలిసిన అన్నదమ్ముల కథ. కానీ ఆ కథను నేను చెప్పిన విధానం కొత్తగా ఉంది అంతే అని చెప్పుకొచ్చారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…