Roshan Kanakala: సుమ రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ త్వరలోనే హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈయన బబుల్ గమ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు హీరోగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 29వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రోషన్ కి ఎన్టీఆర్ తన తండ్రి రాజీవ్ మధ్య ఉన్నటువంటి స్నేహబంధం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. గత కొంతకాలంగా ఎన్టీఆర్ రాజీవ్ మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని వీరిద్దరూ మాట్లాడుకోవడం కూడా మానేశారు అంటూ వార్తలు వస్తున్నాయి ఇలాంటి తరుణంలో ఈ విషయం గురించి రోషన్ సమాధానం చెబుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తారక్ అన్న నాన్న లాంటి ఫ్రెండ్స్ చాలా అరుదుగా ఉంటారు.వీరిద్దరి ప్రయాణం స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుంచి మొదలైందని తెలిపారు. ఇలాంటి స్నేహితులను ఎవరు కూడా వదులుకోకూడదు అని రోషన్ తెలిపారు. నాకు ఇలాంటి స్నేహితులే ఉన్నారు. ఇక వీరిద్దరి మధ్య గొడవలు ఉన్నాయి అంటూ వస్తున్నటువంటి వార్తలలో ఏ మాత్రం నిజం లేదని తెలిపారు. వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు ఎలాంటి భేదాభిప్రాయాలు కూడా రాలేదని తెలిపారు.
తారక్ చూసి డాన్స్ నేర్చుకో
వీరిద్దరూ మాట్లాడుకోవడం లేదని విడిపోయారు అంటూ వస్తున్నటువంటి వార్తలు పూర్తిగా అవాస్తవమని రోషన్ తెలిపారు. ఇక నాన్న నేను సినిమాలలోకి రావడానికి తారక్ అన్నని కూడా నాకు ఇన్స్పిరేషన్ గా చూపించారు తారక్ ని చూసి డాన్స్ నేర్చుకొంటూ తరచూ నాకు నాన్న చెప్పేవారని రోషన్ తెలిపారు. ఇండస్ట్రీలో తారక్ అన్నకు చాలా మంచి పేరు ఉందని నేను కూడా అలాంటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తాను. అలాంటి స్థాయికి చేరాలన్నదే నా కోరిక అంటూ ఈ సందర్భంగా రోషన్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…