Featured

Analyst Damu Balaji : జగన్ కు చెల్లి షర్మిల షాక్… పార్టీని జులై 8న కాంగ్రెస్ లో విలీనం దిశగా అడుగులు…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో ఎపుడు ఏం జరుగుతుంది ఏ పార్టీ ఏ పార్టీ వైపు చూస్తోందో చెప్పడం కష్టంగా మారింది. రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. తాజాగా తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తూన్న మాట వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లోకి విలీనం చేస్తుంది అని. నిజానికి షర్మిల పార్టీకి ఇంకా క్షేత్ర స్థాయిలో బలం లేదు, రాజన్న బిడ్డగా ఆమెను చూస్తున్నారు. అయితే ఆమె పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే మాత్రం ఆ ప్రభావం ఏపీ రాజకీయాల్లో ఉంటుంది అంటూ అనలిస్ట్ దాము బాలాజీ అభిప్రాయంపడ్డారు.

షర్మిల అడుగు హస్తం వైపుకు…

రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నుండే సీఎం అయ్యారు. కానీ ఆయన ఓటు బ్యాంకును ఏపీ లో కానీ తెలంగాణ లో కానీ కాంగ్రెస్ పార్టీ వినియోగించుకోలేక పోయింది. రాజన్న తమ వాడు అని చెప్పుకోలేక పోయింది. ఆయన కొడుకు జగన్ పార్టీ పెట్టడంతో ఏపీ లో కాంగ్రెస్ సీనియర్ లీడర్స్ అందరూ జగన్ వైపు చూడగా తెలంగాణ లోని కాంగ్రెస్ నాయకులు అటు రాజశేఖర్ రెడ్డి ని తమ వాడు అని వాడుకోలేక నాయకత్వ లేమితో ఇబ్బందిపడ్డారు. అయితే తాజాగా షర్మిల తెలంగాణ లో ప్రజల కోసం రాజన్న ఆశయాలను నెరవేర్చాలని పార్టీ పెట్టింది. పాదయాత్ర అంటూ మరోసారి జనంలోకి వెళ్ళింది. అయితే తాజాగా వినిపిస్తున్న మాట షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లోకి తన తండ్రి పుట్టినరోజు జులై 8న విలీనం చేయబోతోంది అని అంటూ బాలాజీ తెలిపారు. ఇప్పటికే కర్ణాటక రాష్ట్ర డిప్యూటీ సీఎం డికే శివకుమార్ గారితో షర్మిల చర్చించందని ఆయన తన తండ్రికి మంచి స్నేహితుడు అంటూ ప్రచారరం జరుగుతోంది.

ఇక తాజాగా రాహుల్ గాంధీ పుట్టినరోజు నాడు షర్మిల సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పడం కూడా ఈ అనుమానలకు బలం చేకూరుస్తోంది. అయితే షర్మిల పార్టీ విలీనంకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. రేవంత్ రెడ్డి దీనికి సుముఖంగా లేరు. ఇక ఈ ఇష్యూ ఖచ్చితంగా ఏపీ లో ప్రభావం చూపొచ్చు. జగన్ మీద ఈ అంశం ప్రతికూల ప్రభావం చుపొచ్చని బాలాజీ అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఆమెను ఏపీ కాంగ్రెస్ లోకి తీసుకుంటే కాంగ్రెస్ ఓటు బ్యాంకు మీద ప్రభావం చూపి జగన్ కి నష్టమే అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago