Analyst Damu Balaji : సినిమా తారగా ప్రయాణం మొదలుపెట్టి హీరోయిన్ గా అగ్రస్థానంలోకి అడుగుపెట్టిన అందలంతార జయలలిత. అయితే ఆమె సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ అలాగే ఎదిగారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా తిరుగు లేని విజయాలను చూసిన జయలలిత 2016 డిసెంబర్ లో అనారోగ్య కారణాలతో మరణించారు. ఆమె మరణం కూడా పెద్ద వివాదాలకు దారి తీసింది. ఆమె ఎపుడో చనిపోతే కావాలనే అది దాచి పెట్టి రాజకీయం చేశారని, శశికళ జయలలిత మరణానికి కారణం అని పలు వాదనలు వినిపించాయి. చివరికి తమిళనాడులో కొత్తగా ఏర్పడిన స్టాలిన్ ప్రభుత్వం ఆమె మరణం మీద విచారణ జరుపడానికి కమిషన్ ఏర్పాటు చేయగా ఆ కమిషన్ శశికళను కూడా విచారించాలని కోరింది. ఇక ఈ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ మరిన్ని ఆసక్తికర విషయాలను తెలిపారు.
అమ్మ, చినమ్మ స్నేహం…
జయలలిత గారు ఎంజీఆర్ మరణించాక పలు సంక్షోభాల నడుమ సీఎం అయ్యారు. ఎంజీఆర్ ఉన్న సమయంలోనే జయలలితకు శశికల పరిచయం ఉంది. నిజానికి జయలలిత మీద నిఘా పెట్టడం కోసం శశికళ ను ఏర్పాటు చేశారనే వాదన ఉంది అంటూ బాలాజీ తెలిపారు. ఇక జయలలిత సీఎం అయ్యాక శశికళ అన్నీ తానై రజ్యంగేతర శక్తిగా తయారైంది అంటూ తెలిపారు. అయితే ఒకానొక సమయంలో జయలలితను మించి శశికళ ఎదిగారు, ప్రభుత్వంలో ఏం జరగాలి అన్నాకూడా శశికళ కనుసన్నల్లోనే జరిగేది అంటూ తెలిపారు.
ఇక మన్నర్ గుడి మాఫియా లాగా శశికళ ఆమె బంధువులు తయారయ్యారు, ఒక కోటరీ లాగా జయలలిత చుట్టూ చేరారు అంటూ తెలిపారు. ఇక ఆమె మరణం కూడా అంతే వివాదాస్పదమైంది. ఆమె మరణానికి ముందు శశికళ మాత్రమే జయలలిత వద్ద ఉండేది. ఆమెను ఎవరు కలవాలి అన్నా శశికళ అనుమతి ఉండాలి అనే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం జయలలిత మరణం మీద వేసిన కమిషన్ లో శశికళ ను కూడా విచారణ జరపాలి అనే అంశం ఉండడం విశేషం అంటు బాలాజీ తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…