Janagama SI Sucide : జనగాంలో బుధవారం నాడు ఎస్ఐ దంపతుల ఆత్మహత్య కలకలం రేపింది. మొదట ఎస్ఐ శ్రీనివాస్ భార్య బాత్రూంలో ఉరి వేసుకుని మరణించగా అది తట్టుకోలేక గంటలోనే భర్త ఎస్ఐ శ్రీనివాస్ రివాల్వర్ తో కాల్చుకుని మరణించాడు. రివాల్వర్ పేలిన శబ్ధం రావడంతో అప్రమత్తమైన వాటర్ సిబ్బంది విషయం స్థానిక పోలీసులకు పై అధికారులకు సమాచారం ఇచ్చారు. అసలు ఎస్ఐ దంపతుల మరణాలకు కారణాలు ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉన్నాయి. కుటుంబ కలహాల వల్లే వారు మరణించి ఉండవచ్చని అనుకుంటున్నారు.
ఫ్రెండ్లీ పోలీసుగా పేరు…
శ్రీనివాస్ గారి సొంతూరు బెల్లంపల్లి కాగా ఆయన భార్యది జమ్మికుంట, వారికి ఇద్దరు కుమారులు. మొదటి కొడుకుకు ఇటీవలే పెళ్లి చేయగా పిల్లలు వేరే చోట ఉంటున్నారు. ఇక కానిస్టేబులే గా తన జీవితం మొదలు పెట్టిన శ్రీనివాస్ గారు ఇటీవలే ఎస్ఐ గా పదోన్నతి పొందారు. 50 ఏళ్ల శ్రీనివాస్ గారి ఇంట్లో ఎటువంటి కలహాలు లేవని ఆయన అందరికీ నచ్చిన పోలీసు అంటూ స్థానికులు చెబుతున్నారు. ఆయన భార్య మరణించిన వెంటనే అక్కడికి చేరుకున్న సన్నితులు కూడా మీరు ధైర్యంగా ఉండాలి అని చెప్పి శ్రీనివాస్ గారిని ఒదార్చారు.
అయినా ఆయన క్షణికావేశంలో బాత్రూంలోకి వెళ్లి రివాల్వర్ తో ఘాట్ చేసుకున్నారు. భార్య మరణం ఒక వైపు చుట్టూ ఉన్న వాళ్లకు భార్య ఎందుకు ఆత్మహత్య చేసుకుందనే ప్రశ్నకు సమాధానం చెప్పాలని దిగులుతోనే ఆయన మరణించినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. శ్రీనివాస్ గారి భార్య స్వరూప తండ్రి కూడా వారికి ఎటువంటి గొడవలు లేవని స్పష్టం చేశారు. ఇక తల్లిదండ్రుల ఆకస్మిక మరణంతో ఆయన ఇద్దరు పిల్లలు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
ప్రేమతో మొదలైన ఒక బంధం చివరకు నేరంగా మారిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో కలకలం రేపుతోంది. మొదట చూసిన వారికి…
బిగ్‌బాస్ ఫేమ్ అషు రెడ్డి, టెక్కీ ధర్మేంద్ర మధ్య నెలకొన్న ఆర్థిక వివాదం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. పెళ్లి…
దక్షిణ భారత సినీ ప్రపంచంలో తన ప్రత్యేక నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సత్యరాజ్ ప్రయాణం ఎంతో కష్టసాధ్యంగా సాగింది. నేటి…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన అనుష్క శెట్టి తన సినీ ప్రయాణంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాజాగా…
ప్రమాదకర బైక్ స్టంట్లపై హైదరాబాద్ పోలీసులు మరోసారి కఠిన హెచ్చరిక జారీ చేశారు. నగర పోలీస్ కమిషనర్ వి. సి.…
టాలీవుడ్ నటి, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందిన మంచు లక్ష్మి రాజకీయ ప్రవేశంపై చేసిన తాజా వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.…