Siddharth -Aditi Rao Hydari: సిద్ధార్థ్, అదితిరావు హైదరి మధ్య ఏదో ఉందంటూ గత కొద్దిరోజులకు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి ఇలా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని ముంబైలో ఇద్దరు సహజీవనం కూడా చేస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున వీరి రిలేషన్ గురించి వార్తలు వస్తున్నాయి.ఇలా తరచూ వీరి డేటింగ్ రూమర్స్ వినిపించినప్పటికీ ఈ విషయం గురించి ఈ జోడి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
ఇక ఈమె కోసం సిద్ధార్థ్, చెన్నై వదిలి ముంబైకి వెళ్లిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.ఇక ముంబైలో వీరిద్దరూ కలిసి రెస్టారెంట్లకు వెళ్లడం షాపింగ్ వెళ్లడం వీధుల వెంట జంటగా కనిపించడంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని వార్తలు బలం అయ్యాయి అయితే ఈ వార్తలు గురించి ఎప్పుడూ కూడా వీరిద్దరూ క్లారిటీ ఇస్తూ ఖండించే ప్రయత్నం చేయలేదు.
ఇకపోతే తన స్నేహితుడు శర్వానంద్ నిశ్చితార్థానికి కూడా వీరిద్దరూ కపుల్స్ మాదిరిగా జంటగా హాజరు కావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక తాజాగా మరోసారి ఈ ప్రేమ పక్షులు జంటగా ముంబై థియేటర్లో సందడి చేశారు.అదితి నటించిన జూబిలీ అనే సిరీస్ నేటి నుంచి ఆమెజాన్ లో స్ట్రీమింగ్ కానుంది ఈ క్రమంలోనే సెలబ్రిటీల కోసం ముంబైలోని ఓ థియేటర్లో ప్రీమియర్ షో వేశారు.
ఈ ప్రీమియర్ షో చూడటం కోసం సిద్ధార్థ్, అదితి జంటగా హాజరయ్యారు. ఇలా ఈ షో చూడటానికి వెళ్ళిన వారు చూసి రాకుండా ఫోటోలకు కలిసి పోజులిచ్చారు దీంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ కావడంతో మరోసారి వీరి డేటింగ్ రూమర్స్ తెరపైకి వచ్చాయి.ఇక వీరిద్దరూ మహాసముద్రం అనే సినిమాలో కలిసిన నటించారు అప్పటి నుంచి వీరి మధ్య ఈ విధమైనటువంటి రిలేషన్ కొనసాగుతుందని వార్తలు వస్తున్నాయి.మరి ఇప్పటికైనా ఈ జంట వీరి మధ్య ఉన్న రిలేషన్ పై స్పందిస్తూ క్లారిటీ ఇస్తుందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…