Analyst Damu Balaji : ఎన్నో ఏళ్లుగా వినిపిస్తున్న ఒక వార్త, అది నిజం కాదు అని ఇప్పటి వాళ్లకు తెలియదు నిజం అనడానికి సాక్ష్యం లేదు. అదే దివంగత టీడీపీ అనంతపురం లీడర్ పరిటాల రవి, పవన్ కళ్యాణ్ మధ్య గొడవ, పవన్ కి పరిటాల గుండు కొట్టించడం. ఇప్పటివరకు ఇంకా ఈ రూమర్ అక్కడక్కడా వినిపిస్తూ ఉంది. తాజాగా పవన్ కళ్యాణ్ ను విమర్శించడానికి వైసీపీ వాడుకుంటున్న ఈ వార్తలో ఎంత నిజముంది అనే విషయాన్ని అనలిస్ట్ దాము బాలాజీ తెలిపారు.
స్థలం విషయంలో జరిగింది అది…
నిజానికి స్థలం వివాదంలో జరిగిన గొడవ వల్ల పరిటాల రవి పవన్ కళ్యాణ్ వారి ఊరు వెంకటాపురంకి తీసుకెళ్లి గుండు కొట్టించి పంపారని 1998 ఆ ప్రాంతంలో బాగా రూమర్ వచ్చింది. అయితే నిజానికి అదంతా వట్టి పుకారు మాత్రమే అందులో నిజం లేదని అప్పటి జర్నలిస్ట్ ఇపుడు అనలిస్ట్ గా ఉన్న బాలాజీ తెలిపారు. నిజానికి స్థలం విషయంలో అసలు గొడవ జరగలేదని అయన చెబుతున్నారు. హైదరాబాద్ లో కారు బాంబు దాడి అనంతరం పరిటాల రవి ఇంటి వద్ద సెక్యూరిటీ పెంచాలని భావించి చుట్టూ ఉన్న స్థలాలను కూడా కొనాలని రవి అనుకున్నారు. అలా ఒక స్థలం చిరంజీవి కి సంబందించినది కావడంతో అయనను సంప్రదించి అడిగిన రేటుకే కొన్నారు. అసలు ఎలాంటి వివాదం ఈ విషయంలో జరగలేదు.
ఇక అసలు పరిటాల గారు పవన్ కళ్యాణ్ ఎపుడూ కలిసింది కుడా లేదు. ఇక ఇదే రూమర్ ను పరిటాల గారిని అడిగితే ఆయనే స్వయంగా అలాంటిదేమి లేదు, ఇది టీడీపీ పార్టీ ఆఫీస్ నుండే వచ్చిన రూమర్ అని చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్ సినిమాలు ఫ్లాప్ అవుతున్న సమయంలో డిప్రెషన్ లోకి వెళ్లారు ఆ సమయంలోనే గుండు కొట్టించుకున్నారు అంతే తప్ప అసలు ఈ విషయంలో నిజం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు బాలాజీ. కేవలం ప్రస్తుతం ఉన్న రాజకీయ లబ్ది కోసం ప్రత్యర్థులు దీన్ని వాడుకుంటున్నారు. ఇక ఆర్జీవి రక్త చరిత్ర సినిమాలో చూపించడంతో నిజం అనుకుంటున్నారు. కానీ అది ఫేక్ అంటూ చెప్పారు బాలాజీ. ఇక టీడీపీ మరియు చిరంజీవి మధ్య ఎక్కడా విబేధాలు లేవు అంటూ బాలాజీ తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…