Venu Swamy: ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఎంతోమంది సినీ రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలని చెబుతూ తరచు వార్తలు నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఈయన తాజాగా రామ్ చరణ్ ఉపాసనలకు జన్మించిన చిన్నారి జాతకం చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వేణు స్వామి ఉపాసన కుమార్తె జాతకం గురించి చెబుతూ ఈ చిన్నారి పునర్వసు నక్షత్రంలో జన్మించిందని తెలిపారు.
దైవాంశమైనటువంటి పునర్వసు నక్షత్రంలో పుట్టినటువంటి ఈ చిన్నారి జాతకం ఎంతో అద్భుతంగా ఉందని వేణు స్వామి తెలిపారు. భవిష్యత్తులో ఈమెకు రాజయోగం ఉందని తన తాత చిరంజీవి తండ్రి రామ్ చరణ్ లను మించి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటుందని వేణు స్వామి తెలిపారు. చిన్నారి అద్భుతమైన గడియలలో జన్మించిందని ఈమె గొప్ప జాతకురాలు అంటూ వేణు స్వామి తెలియజేశారు.
ఇక పాప పుట్టిన గడియలను బట్టి చూస్తే ఉపాసన రాంచరణ్ లకు మగ సంతానం కలిగే అవకాశాలు ఏమాత్రం లేవని ఈయన తెలియజేశారు. ఇలా ఈ దంపతులకు మరో సంతానం ఉండకపోవచ్చు అంటూ వేణు స్వామి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక వేణు స్వామి చిన్నారి గురించి మాట్లాడుతూ అద్భుతమైన మహాజాతకురాలుగా ఉన్నటువంటి ఈ చిన్నారి చిన్న సమస్యలతో బాధపడుతుందని తెలిపారు.
ఈమెకు అదృష్ట యోగం ఉన్నప్పటికీ పంటికి, చెవికి సంబంధించి చిన్న సమస్యలు కూడా తలెత్తుతాయి అంటూ వేణు స్వామి తెలియజేశారు. ఇలా మెగా ఇంట్లో చిన్నారి జన్మించడంతో మెగా కుటుంబ పరువు ప్రతిష్టలు మరింత పెరుగుతాయి అంటూ ఈ సందర్భంగా వేణు స్వామి చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…