Analyst Damu Balaji : నక్సలిజం, మావోయిస్టులు ఈ పేర్లు ఇప్పుడు వినడం తక్కువైంది కానీ ఒకప్పుడు అన్నల పేరు చెబితే పల్లెల్లు భయపడేవి. తుపాకీ పడితేనే న్యాయం జరుగుతుందని సాయుధ తిరుగబాటుతోనే దేశంలో న్యాయం ఉంటుందని భావించి అడవిలో ఉంటూ పోలీసుల మీద రాజకీయ నాయకుల మీద పోరాడుతున్న సామాన్య జనంకు అండగా ఉన్నాం అంటూ చెప్పే మావోయిస్టు దళాలు ప్రస్తుతం అంత యాక్టీవ్ గా లేవు. ఒకప్పటి నక్సలిజంతో పోలిస్తే ఇపుడు బాగ తగ్గిపోయింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో నక్సలిజం ప్రభావం తగ్గింది ఇంకా కొంత ఛతీష్గడ్ ప్రాంతంలో ఇప్పటికీ కొంత ప్రభావం చూపుతున్నారు. అలాంటి మావోయిస్టులు వారి సిస్టమాటిక్ జీవితం అడవిలో ఎలా ఉంటుందో మాజీ నక్సలైట్ ప్రస్తుతం అనలిస్ట్ గా ఉన్న దాము బాలాజీ వివరించారు.
పెళ్లిళ్లు చేసుకున్నా పిల్లల్ని కనరు…
నక్సల్ జీవితం అంతా అడవిలోనే ఉంటుంది. అయితే పట్టణాల్లో కూడా కొంతమంది తిరుగుతూ ఉంటారు. కొరియర్లు అనే పేరుతో మరింతమంది ఉంటారు. నక్సల్ లో పెద్ద లీడర్లు ఎవరు ఎక్కడుంటారో ఎవరికీ తెలియదు. అలాంటి వారు కలవాలి మాట్లాడాలంటే మధ్యలో కొరియర్లు అనే వాళ్ళు పనిచేస్తారు. వారి ద్వారా కలిసి మాట్లాడుకుని మళ్ళీ ఎవరికి వారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారు. ఇదంతా ఒక సిస్టమేటిక్ విధానంలో జరుగుతుంది అంటూ బాలాజీ తెలిపారు. దళం పేరుతో టీమ్స్ ఉంటాయి. నక్సలైట్ జీవితంలో పెళ్లి ఉంటుంది కానీ పిల్లలు ఉండరు. పిల్లల్ని కంటే సమస్యలు వస్తాయి అందుకే కనకూడదు అంటూ అందుకే నాకు పిల్లలు లేరు అంటూ చెప్పారు. ఇక పిల్లల్ని కనడం వల్ల జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అంటూ జరిగిన సంఘటన చెప్పారు బాలాజీ. ఒక కొరియర్ జంట ద్వారా దాదాపు ముగ్గురు అగ్ర లీడర్లు కలవాలని అనుకున్నారు.
అయితే ఆ కొరియర్ జంటకు ఒక పాప ఉంది, ఐదో తరగతి చదువుతున్న ఆ పాపను పోలీసులు తమ కస్టడీలో పెట్టుకుని మెయిన్ లీడర్లను పట్టిస్తే పాప బతుకుతుంది లేదంటే చంపేస్తామని బెదిరించారు. అలా ముగ్గురు లీడర్లను ఇంటికి పిలిచి మత్తు కలిపిన ఆహారం పెట్టడంతో పోలీసులకు దొరికిపోయారు. వారిని ఎన్కౌంటర్ చేసారు. ఆ కొరియర్ జంటను విదేశాలకు పంపించేసారని చెప్పుకుంటారు అందుకే నక్సలైట్స్ పిల్లల్ని కనరు, రూల్ ఉంటుంది అంటూ చెప్పారు. ఇక పెట్టే రూపాయి ఖర్చు చెప్పాల్సిందే. దళ సభ్యులకు జీతాలు ఉండవు. కేవలం పట్టణాల్లో తిరిగే నక్సలైట్స్ కి మాత్రం డబ్బు యిస్తారు. ప్రతి రూపాయికి లెక్క చెప్పాలి అంటూ ఆయన అనుభవాలను పంచుకున్నారు బాలాజీ.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…