Featured

Rakesh Master Friend : రాకేష్ మాస్టర్ మీద ఎటాక్… రూమ్ లో రెండు బీర్లు… నోట్లో నుండి రక్తం… సెల్ ఫోన్ మిస్సింగ్… హత్యా.. కొట్టిచంపారా…: రాకేష్ మాస్టర్ ఫ్రెండ్

Rakesh Master Friend : సినిమా ఇండస్ట్రీలో డాన్స్ మాస్టర్ గా మొదలయి దాదాపు 1500 సినిమాలకు డాన్స్ కంపోజ్ చేసిన రాకేష్ మాస్టర్ అసలు పేరు రామారావు. ప్రస్తుతం టాప్ డాన్స్ మాస్టర్లు గా ఉన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లు ఈయనకు శిష్యులు. చిరునవ్వుతో, లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, సీతయ్య వంటి సినిమాలకు కోరియోగ్రఫీ చేసిన రాకేష్ మాస్టర్ ఢీ షో ద్వారా మరింత క్రజీ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం యూట్యూబ్ ఛానెల్ వీడియోల ద్వారా ఫేమస్ అయ్యాడు. ఇక జబర్దస్త్ లో అడపాదడపా కనిపించేవాడు. అయితే తాజాగా వైజాగ్ నుండి షూటింగ్ కోసం వెళ్లి హైదరాబాద్ తిరిగిగివచ్చిన రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో గాంధీ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ ఆదివారం నాడు కన్నుమూశారు. ఇక ఆయనది సహజ మరణం కాదేమో అంటూ ఆయన స్నేహితుడు రాకీ భాయ్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

నోటి మీద గాయం… సెల్ ఫోన్ మిస్సింగ్…

రాకేష్ మాస్టర్ వైజాగ్ వెళ్లి అక్కడి నుండి హైదరాబాద్ తిరిగి వచ్చాక ఆదివారం నాడు గాంధీ హాస్పిటల్ లో మరణించారు. అయితే ఆయన మరణం మీద అనుమానలు ఉన్నాయంటూ రాకేష్ మాస్టర్ స్నేహితుడు ఆరోపిస్తున్నారు. ఆయన నోరు పగిలి రక్తం రావడం హాస్పిటల్ లో చేర్పించేసరికి కడుపులో నొప్పి అంటూ విలవిలలాడారు అంటూ చెప్పారు. నిజానికి శనివారం రాత్రి వరకు బాగానే ఉన్నారు. రాత్రి ఆయనతో మరో సన్నిహిత వ్యక్తి రాత్రి పొద్దు పోయే వరకు ఉన్నారు. రాకేష్ మాస్టర్ ఉన్న రూమ్ ఏరియా చాలా నిర్మానుష్యంగా ఉంటుంది, ఆయన ఎవరినీ తన వద్ద ఉండనివ్వరు. అయితే ఆయన ఒక్కడే ఉన్న ఆ రాత్రి ఏదో జరిగింది.

పొద్దున్నే వెళ్లి చూసేసరికి నోరు పగిలి రక్తం వస్తోందట అలాగే కడుపు నొప్పికి బాగా బాధపడ్డారట. ఇక ఆయన ఫోన్ కూడా మిస్ అయింది. హాస్పిటల్ లో కూడా మొదట ఇది యాసిడ్ కేసు వార్డు వేరే ఉంటుంది అంటూ గాంధీ హాస్పిటల్ లో చెప్పారట. రూమ్ లోకూడా రెండు బూమ్ బూమ్ బీర్లు కనిపించాయి. ఆయన బీర్లు తాగరు. కేవలం మాన్షన్ హౌస్ తాగుతారు. ఎవరైనా అర్ధ రాత్రి వచ్చి కొట్టి వెళ్లిపోయారో లేక చంపాలనుకున్నారో తెలియడం లేదు అంటూ రాకేష్ మాస్టర్ స్నేహితుడు తెలిపారు. వైజాగ్ లో కూడా ఏదో గోడవ జరిగిందని రాకేష్ మాస్టర్ తెలిపారు. మరి ఆ తాలూకు వాళ్లే ఇలా హైదరాబాద్ వచ్చి కొట్టరేమో తెలియడం లేదు అంటూ అనుమానాలను వ్యక్తం చేసారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago