Analyst Damu Balaji : సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ మొదటి సారి స్క్రీన్ షేర్ చేసుకున్న సినిమా ‘బ్రో’. తాజాగా ఆ సినిమా విడుదల కాగా సినిమాకు పెద్దగా కలెక్షన్స్ లేవనే టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ రేంజ్ సినిమా కాదని పవన్ అభిమానులే వాపోతుండటం, అసలు సినిమా ఫ్లాప్ అవడానికి మెయిన్ కారణం అదే అంటూ పలువురు విశ్లేషస్తుండగా సినిమా కలెక్షన్స్ గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడరు.
సినిమా బడ్జెట్ తిరిగిరాలేదు…
బ్రో సినిమా విడుదలయిన రోజు నుండి ఇప్పటివరకు 75.5 కోట్లు వసూళ్లు వచ్చాయని, ఇది మంచి వసూళ్లు అయినా సినిమా బడ్జెట్ 150 కోట్లు కాగా 75 కోట్లు రావడంతో నిర్మాత నష్టాలను భరించాలని బాలాజీ తెలిపారు. వీకెండ్ లో సినిమాకు కలెక్షన్స్ బాగానే వచ్చినా సోమవారం నాడు రెండు రాష్ట్రాలలోనూ కలిసి ఏడు కోట్లు కూడా వసూళ్లు రాబట్టలేకపోయిందని చెప్పారు.
పవన్ కళ్యాణ్ సినిమాకు ఓపెనింగ్స్ ప్రతి సినిమాకు బాగుంటాయి. అయితే ఈ సినిమాకు ఈమధ్య కాలంలో వచ్చిన అన్ని సినిమాల కన్నా తక్కువ వసూళ్లు వచ్చాయని అలా చూస్తే సినిమా ఫ్లాప్ గానే భావించాలని బాలాజీ అభిప్రాయపడ్డారు. ఇక ఫ్లాప్ కి మెయిన్ కారణం త్రివిక్రమ్ అంటూ పవన్ అభిమానులే అనుకుంటున్నారని, గురూజీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువై సినిమా చెడిపోయిందని, పవన్ కి సూట్ అయ్యేలా సినిమా చేయలేదని త్రివిక్రమ్ మీద పవన్ అభిమానులు గుర్రుగా ఉన్నట్లు బాలాజీ తెలిపారు.
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…
ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…
ఇతిహాసాలలో ధర్మం, మానవత్వం గురించి చెప్పే గొప్ప ఉదాహరణల్లో ఒకటి రామాయణ యుద్ధం చివర్లో జరిగిన సంఘటనగా పండితులు పేర్కొంటారు.…
ఆంధ్రప్రదేశ్‌లోని పుణ్యక్షేత్రాల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కుండలేశ్వర స్వామి క్షేత్రం భక్తుల విశ్వాసానికి కేంద్రంగా నిలుస్తోంది. పవిత్ర గోదావరి…
సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు కొత్త విషయం కాదు. అయితే కొంతమంది సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం మాత్రం ఎప్పటికప్పుడు…
ఆయుర్వేద ఔషధాల్లో ప్రముఖ స్థానం ఉన్న అశ్వగంధపై కేంద్ర సంస్థలు కీలక నిర్ణయం తీసుకోవడం ఆరోగ్య రంగంలో చర్చనీయాంశంగా మారింది.…