Analyst Damu Balaji : వివేకానంద రెడ్డి మరణించి నాలుగేళ్లు కావొస్తున్నా చంపింది ఎవరనే విషయాలు స్పష్టంగా ఇప్పటికీ తెలియరాలేదు. ఏపీ సీఎం కి సొంత బాబాయ్ అయినా ఎవరు చంపారో ఇప్పటికీ తెలియక పోవడం పట్ల అటు విపక్షాల నుండి గట్టి విమర్శిలే ఎదుర్కొంటున్న జగన్, ఇంట్లోనే హంతకులున్నారనే కథనాలు వినిపిస్తున్న విమర్శకు కౌంటర్లు వేస్తున్నారే కానీ కేసులో మాత్రం పురోగతి లేదు. రోజుకో పేరు బయటికి వస్తోంది, ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు అంటూ వార్తలు వినిపించినా అవేవి జరగలేదు. అయితే తాజాగా ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి ని వైసీపీ టార్గెట్ చేసిందని ఆయన భార్య షబానా ఆరోపిస్తున్నారు. ఇక ఈ ఇష్యూ గురించి అనలిస్ట్ దాముబాలాజీ మాట్లాడారు.
మమల్ని చంపేయండి… ప్రశాంతంగా ఉంటాం…
వివేకానంద రెడ్డిని తానే హత్య చేసానంటూ అప్రూవర్ గా మారిన దస్తగిరి వాంగ్మూలం ప్రకారమే సిబిఐ విచారణ జరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురుని ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి తో సహా అరెస్టు చేసి రిమాండ్ ఖైదీలుగా ఉంచారు. నెలలు గడుస్తున్నా విచారణ ఒక కొలిక్కి రావడం లేదు. కేసులో దస్తగిరి వల్లే వాళ్లందరూ జైలులో ఉన్నారనే పగతో మమల్ని వైసీపీ వాళ్ళు వేధిస్తున్నారు అంటూ దస్తగిరి అలాగే అతని భార్య ఆరోపిస్తున్నారు అంటూ బాలాజీ తెలిపారు.
తమ మీద తప్పుడు కేసులు పెడుతూ అలాగే తమ ఆర్థిక మూలాలను దెబ్బతీస్తూ ఇబ్బంది పెడుతున్నారని దస్తగిరి భార్య షబానా తెలిపారు. ఆమె మాట్లాడుతూ ఇవన్నీ చేస్తూ మమ్మల్ని రోజూ ఇబ్బంది పెట్టే బదులు చంపేయండి, ప్రశాంతంగా చనిపోతాం. ఖచ్చితంగా నా భర్తకు మా కుటుంబానికి వైసీపీ నుండి ప్రాణ హాని ఉంది, నా భర్తకు సెక్యూరిటీ ఇచ్చారు కాబట్టి ఇలా మమ్మల్ని కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ఆమె ఆరోపించారని బాలాజీ తెలిపారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…