Titan Submarine : ఉత్తర అంట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ షిప్ గురించి మనకు తెలుసు. 1912 ప్రాంతంలో జరిగిన టైటానిక్ ప్రమాదంలో సుమారు 1500 మంది మరణించారు. అయితే ఆ షిప్ శిథిలాలను కనుగొన్నా సముద్ర అడుగున ఉన్న వాటిని చేరుకోవడం కష్టం. అయితే ఓషన్ గేట్ సంస్థ తయారు చేసిన టైటన్ సబ్ మెరైన్ తాజాగా ఆ సాహసం చేసింది. ఐదగురు వ్యక్తులు ఆ సబ్ మెరైన్ ద్వారా సముద్రం లోపలికి వెళ్లి టైటానిక్ శిథిలాలను చూడాలని భావించారు. అయితే వారి సహస యాత్ర విషాదంగా మారింది. సముద్రంలోకి వెళ్లిన వారి జాడ నాలుగు రోజులు దాటినా ఇప్పటికీ తెలియరాలేదు. వారికి సబ్ మెరైన్ లో ఉన్న ఆక్సిజన్ నిల్వలు కూడా ఇప్ప్పటికే ఖాళీ అయ్యుంటాయనే అంచనాతో వారు మరణించి ఉండేందుకు ఎక్కువ అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే గలింపు చర్యలను మాత్రం ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.
బ్రతికి ఉండే అవకాశం లేదు…
టైటన్ సబ్ మెరైన్ లో ఐదుగురు వ్యక్తులు వెళ్లగా అందులో బ్రిటన్ కుబేరుడైన హామీష్ హార్దింగ్, ఫౌండర్ అండ్ సీఈఓ అఫ్ ది ఆపరేటింగ్ కంపెనీ స్టాక్టన్ రష్, ఫ్రెంచ్ నావికుడైన పాల్ హేనరీ నర్జెలౌట్ మరియు పాకిస్థాన్ సంతతికి చెందిన లండన్ వ్యాపారవేత్త షాజడా దావుద్ మరియు అతని కొడుకు సులేమాన్ ఉన్నారు. ఒక్కో టికెట్ ధర దాదాపు రెండున్నర కోట్లు పెట్టి వెళ్లారు. తాజాగా సబ్ మెరైన్ సముద్రం లోపలకి ఒత్తిడికి పెళ్లిపోయి ఉండవచ్చు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో మెరైన్ లోని అందరూ చనిపోయి ఉండవచ్చునని భావిస్తున్నారు. సబ్ మెరైన్ నుండి ఎటువంటి శబ్దాలు రావడం లేదని చెబుతున్నారు.
అయితే ఇప్పటికీ గాలింపు చర్యలు జరుపుతున్న అమెరికా కోస్ట్ గార్డ్ నావికా దళంకు వాతావరణం అనుకూలించడం లేదు. ఇప్పటి వరకు సుమారు 20,000 చ.కి.మీ గాలింపు లో భాగంగా కవర్ చేసారు. ఇది దాదాపుగా మిజోరాం పరిమాణం. ఇంకా U.S. నావికాదళం 27 టన్నుల కంటే ఎక్కువ ఎగురవేయగల ప్రత్యేక డీప్-వాటర్ సాల్వేజ్ సిస్టమ్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఇది తప్పిపోయిన సబ్‌మెర్సిబుల్ బరువు కంటే ఎక్కువ, టైటన్ సబ్ మెరైన్ దాదాపు 9 టన్నుల బరువు ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…