Titan Submarine tragedy : ఉత్తర అంట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ షిప్ గురించి మనకు తెలుసు. 1912 ప్రాంతంలో జరిగిన టైటానిక్ ప్రమాదంలో సుమారు 1500 మంది మరణించారు. అయితే ఆ షిప్ శిథిలాలను కనుగొన్నా సముద్ర అడుగున ఉన్న వాటిని చేరుకోవడం కష్టం. అయితే ఓషన్ గేట్ సంస్థ తయారు చేసిన టైటన్ సబ్ మెరైన్ తాజాగా ఆ సాహసం చేసింది. ఐదగురు వ్యక్తులు ఆ సబ్ మెరైన్ ద్వారా సముద్రం లోపలికి వెళ్లి టైటానిక్ శిథిలాలను చూడాలని భావించారు. అయితే వారి సహస యాత్ర విషాదంగా మారింది. సముద్రం లోకి వెళ్లిన వారి జాడ నాలుగు రోజులు దాటినా ఇప్పటికీ తెలియరాలేదు. వారికి సబ్ మెరైన్ లో ఉన్న ఆక్సిజన్ నిల్వలు కూడా ఇప్పటికే ఖాళీ అయ్యుంటాయనే అంచనాతో వారు మరణించి ఉండేందుకు ఎక్కువ అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే గాలింపు చర్యలను మాత్రం ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.
అపుడు ముత్తాత ఇప్పుడు మునిమనవడు…
ఓషన్ గేట్ కంపెనీ కి చెందిన టైటన్ సబ్ మెరైన్ లో టైటానిక్ షిప్ శిథిలాలను చూడటానికి బయలుదేరిన ఐదుగురు ఈ పాటికే మరణించి ఉంటారని అందరూ భావిస్తుండగా అందులో ప్రయాణించిన బ్రిటన్ కుబేరుడైన హామీష్ హార్దింగ్, ఫౌండర్ అండ్ సీఈఓ అఫ్ ది ఆపరేటింగ్ కంపెనీ స్టాక్టన్ రష్, ఫ్రెంచ్ నావికుడైన పాల్ హేనరీ నర్జెలౌట్ మరియు పాకిస్థాన్ సంతతికి చెందిన లండన్ వ్యాపారవేత్త షాజడా దావుద్ మరియు అతని కొడుకు సులేమాన్ ఉన్నారు. అయితే ఓషన్ గేట్ కంపెనీ సీఈఓ అయిన స్టాక్టన్ రష్ గురించి ఒక ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. స్టాక్టన్ రష్ భార్య వెండి రష్ పూర్వికులు ఇటువంటి ప్రమాదంలోనే మరణించారు.
1912 లో జరిగిన టైటానిక్ షిప్ దుర్గటనలో 1500 వదలకు పైగా చనిపోయారు. అందులో ఇసిడోర్ స్ట్రాస్, ఇడా అనే దంపతులు ఉన్నారు. వారి మునిమనవరాలే వెండి రష్. న్యూయార్క్ లోని అత్యంత ధనవంతుల్లో ఒకరైన ఇసిడోర్ స్ట్రాస్ తన భార్యతో మొదటి సముద్రయానం కోసం టైటానిక్ వెళ్లగా అక్కడ మరణించారు. ఇప్పుడు వారి ముని మనవడు వెండి రష్ భర్త, స్టాక్టన్ రష్ ఆ టైటానిక్ శిథిలాలను చూడటానికి వెళ్లి అక్కడే జల సమాధి అయ్యారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…