Upasana -Ramcharan:టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా కూడా గుర్తింపు పొందారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రామ్ చరణ్ ప్రస్తుతం తండ్రిగా మారిన విషయం మనకు తెలిసిందే. ఈయన గత 11సంవత్సరాల క్రితం ఉపాసన అనే అమ్మాయిని ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.
ఉపాసన కూడా ఎంతో ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి.ఇక ఉపాసన అపోలో హాస్పిటల్ ఫౌండర్ సి ప్రతాపరెడ్డి మనవరాలు అనే విషయం మనకు తెలిసిందే. ఈయన ఇండియాలో ఉన్నటువంటి టాప్ బిలినియర్స్ లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఇలా ఉన్నతమైన కుటుంబం నుంచి మెగా ఇంటి కోడలుగా ఉపాసన అడుగుపెట్టారు.
ఈ విధంగా ఉపాసన మెగా ఇంటి కోడలుగా అడుగు పెట్టినప్పటికీ ఈమె అపోలో హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ చైర్ పర్సన్ గాబాధ్యతలు వ్యవహరిస్తున్నారు. ఇలా బిజినెస్ ఉమెన్ గా ఉపాసన కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా వృత్తిపరమైన జీవితాలలో ఎంతో మంచి సక్సెస్ సాధించినటువంటి వీరిద్దరూ ప్రస్తుతం తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యారు. ఈ క్రమంలోనే ఉపాసన రాంచరణ్ ఆస్తి గురించి ప్రస్తుతం ఓ వార్త సంచలనంగా మారింది.
ఉపాసన రాంచరణ్ ఆస్తులు కలిపి 2500కోట్ల రూపాయల వరకు ఉంటాయని సమాచారం ఇందులో ఉపాసన ఆస్తి విలువ మాత్రమే 1130 కోట్లు ఉంటుందని తెలుస్తోంది.ఇలా వీరిద్దరూ వృత్తిపరమైన జీవితంలో ఎంతో సక్సెస్ సాధించడమే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉంటూ ఎందరికో ఆదర్శంగా నిలిచారని చెప్పాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…