Analyst Damu Balaji : సినిమా ఇండస్ట్రీలో డాన్స్ మాస్టర్ గా మొదలయి దాదాపు 1500 సినిమాలకు డాన్స్ కంపోజ్ చేసిన రాకేష్ మాస్టర్ అసలు పేరు రామారావు. ప్రస్తుతం టాప్ డాన్స్ మాస్టర్లుగా ఉన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లు ఈయనకు శిష్యులు. చిరునవ్వుతో, లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, సీతయ్య వంటి సినిమాలకు కోరియోగ్రఫీ చేసిన రాకేష్ మాస్టర్ ఢీ షో ద్వారా మరింత క్రేజ్ తెచ్చుకున్నాడు. బషీర్ అనే కంటెస్టెంట్ కి ఢీ షోలో డాన్స్ మాస్టర్ గా ఉండేవాడు. ప్రస్తుతం యూట్యూబ్ ఛానెల్ వీడియోల ద్వారా ఫేమస్ అయ్యాడు. ఇక జబర్దస్త్ లో అడపాదడపా కనిపించేవాడు. అయితే తాజాగా వైజాగ్ నుండి షూటింగ్ కోసం వెళ్లి హైదరాబాద్ తిరిగి వచ్చిన రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో కన్నుమూశారు. అయితే అయన గురించి మరోసారి వైరల్ కామెంట్స్ చేసింది ఆయన మూడో భార్యగా చెప్పే కనకలక్ష్మి.
నాకు మూడేళ్లు నరకం చూపించాడు…
రాకేష్ మాస్టర్ సెలబ్రిటీలను తిట్టడం వల్ల ఇంట్లో ఇబ్బందులు ఎదురవడంతో ఆయన రెండో భార్య పిల్లలకు దూరంగా అయన ఒక రూమ్ తీసుకుని ఉండేవాడు. అయితే ఆ సమయంలో వంట చేయడానికి ఒక మనిషిని సన్నిహితులు ఏర్పాటు చేయగా ఆమెతో రాకేష్ మాస్టర్ సహజీవనం చేసారు. మీడియాతో సహా అందరూ ఆమెను మూడో భార్యగానే చూసారు అంటూ బాలాజీ తెలిపారు. అయితే ఆమె తాజాగా మాస్టర్ చనిపోక ముందు ఒక సెల్ఫీ వీడియోలో తాను ఇలా అయిపోడానికి కారణం ఆమె అని మరికొందరి పేర్లు కూడా చెప్పాడు. ఇక మాస్టర్ చనిపోయాక కౌంటర్ ఇవ్వడానికి అన్నట్లుగా కనకలక్ష్మి వీడియో విడుదల చేసింది.
మాస్టర్ ను తాను ఇష్టపడినట్లు చెబుతూనే వాడు వీడు అంటూ బాగా తిట్టిందని బాలాజీ తెలిపారు. అతను నాకు మూడేళ్లు నరకం చూపించాడు, తాగి కొట్టడం, తిట్టడం చేసేవాడు అంటూ ఆమె ఆరోపించారని బాలాజీ తెలిపారు. తనకు మూర్ఛ రోగం ఉండటం వల్ల ఒంటరిగా రాలేక మాస్టర్ ను కడసారి చూడటానికి రాలేదని, తనకి ఇంతకుముందు కూడా ఆరోగ్యం బాగా చెడిపోయింది అపుడే ఎక్కువ కాలం బ్రతకడని అనుకున్నాం అయితే ఇంత త్వరగా మరణిస్తాడని అనుకోలేదని ఆమె తెలిపినట్లు బాలాజీ చెప్పారు. అయితే చాలా మంది రాకేష్ మాస్టర్ సన్నిహితులు ఆమెతో జరిగిన గొడవలో చెప్పుతో కొట్టినందువల్లే మాస్టర్ మానసికంగా క్రుంగి పోయి ఇలా తయారయ్యాడని చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…