Featured

Analyst Damu Balaji : సర్పంచ్ నవ్య దగ్గర ఆధారాలు లేవు… అంతా ఒట్టిదే… ఎస్ ఐ రమేష్ చెప్పింది ఏంటంటే…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : జానకీపురం సర్పంచ్ నవ్య అలాగే స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య వివాదం డైలీ సీరియల్ లాగా రోజూ వస్తూనే ఉంది. తాజాగా సర్పంచ్ నవ్య తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసారు. తాను ఇంటి నుండి బయటికి వెళితే తిరిగి వస్తానో లేదో తెలియడం లేదని, ఎమ్మెల్యే తనని చంపించాలని చూస్తున్నాడంటూ నవ్య ఆరోపిస్తున్నారు. ఇక ఈ ఇష్యూ మీద అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

నన్ను చంపేస్తారు కాపాడండి…

సర్పంచ్ నవ్య ను లైంగికంగా వేధిస్తున్నాడు అంటూ ఆమె మీడియా ముందుకు గతంలో వచ్చింది. ఆ సమయములో ఎమ్మెల్యే రాజయ్య ఇంటికి వచ్చి క్షమాపణలు కూడా చెప్పారు. ఇక మళ్ళీ ఇపుడు నవ్య తన భర్తను వాడుకుని తనని మళ్ళీ వేధించాలని చూస్తున్నాడని, తన భర్తకు డబ్బు ఆశ చూపి గతంలో చేసిన ఆరోపణలు ఆపద్దమని రాయించుకోవాలని చూసారు, అప్పుగా ఇరవై ఐదు లక్షలు ఇస్తామని బాండు పేపర్ మీద సంతకం చేయించుకోవాలని అనుకున్నారని నవ్య ఆరోపిస్తోంది. అయితే ఈసారి ఆమె ఆధారాలను పోలీసులకు చూపించడం లేదు. బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెబుతోంది కానీ వాటిని బయటపెట్టడం లేదు అంటూ బాలాజీ తెలిపారు. మీడియా ముందు పబ్లిసిటీ కోసం ఇలా చేస్తుండవచ్చు.

నిజానికి గ్రామ అభివృద్ధి కోసం నిధులను ఇస్తానని ఎమ్మెల్యే చెప్పినపుడు అది ఆమె ఒక్కదాని సమస్య కాదు, ఉప సర్పంచ్ మిగిలిన మెంబెర్స్ ను తీసుకెళ్లి ఎమ్మెల్యేతో మాట్లాడిండవచ్చు. ఆలా కాకుండా నవ్య మాత్రమే మీడియా అటెన్షన్ కోసం ప్రయత్తిస్తున్నట్లు అనిపిస్తున్నది. పోలీస్ స్టేషన్ లో రాజయ్య ను అరెస్టు చేయాలంటూ ఫోర్యాదు చేసిన నవ్య వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే మీ వద్ద ఉన్న ఆధారాలను చూపించండి అంటే మాత్రం నేను ఇవ్వను అంటోంది అంటూ బాలాజీ తెలిపారు. అక్కడి స్థానిక ఎస్ ఐ రమేష్ కూడా నవ్య కేసు గురించి మాట్లాడుతూ ప్రాథమిక దర్యాప్తు చేసాము అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే మాత్రం ఆమె వద్ద ఉన్న ఆధారాలేంటో తెలియాలి, అది లేకుండా మేము ఏ అరెస్టు చేయలేము అంటూ చెప్పారని బాలాజీ అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago