Categories: FeaturedMovie News

Analyst Damu Balaji : రానా నాయుడును తొలగించిన నెట్ ఫ్లిక్స్… బూతులే కారణమా… వెంకటేష్ పరువు గోవిందా…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : వెంకటేష్ అనగానే ఫ్యామిలీ హీరో అనే ఇమేజ్ ఉంది. ఇప్పటి వరకు తెలుగులో కాంట్రావెర్సీ లేకుండా ఎటువంటి నెగిటివిటీ లేకుండా ఉన్న హీరో కూడా ఆయనే. అయితే అవన్నీ తలకిందులు చేస్తూ మొదటిసారి కథ ఎంపికలో కొత్తదనం కోసం ప్రయత్నించి విమర్శల పాలయ్యారు. వెంకటేష్, అలాగే తన అన్న కొడుకు రానా తో కలిసి నెట్ ఫ్లిక్స్ ఓటీటి సిరీస్ ‘రానా నాయుడు’ లో నటించారు. అయితే వెంకటేష్ ఉన్న సిరీస్ కదా అని ఫ్యామిలీ ఆడియన్స్ ఓపెన్ చేస్తే అందులో బూతులు తప్ప వేరే ఏమి లేదు. దీంతో తెలుగు ప్రేక్షకులకు నుండి తీవ్రంగా విమర్శలు ఎదురయ్యాయి ఆ సిరీస్కు. దీంతో తాజాగా నెట్ ఫ్లిక్స్ ఆ సిరీస్ ను తెలుగులో తొలగించింది. మొదటిసారి ఇలా జరగడం పట్ల సీనియర్ అనలిస్ట్ దాము బాలాజీ తన విశేషణ ఇచ్చారు.

రానా నాయుడు తొలగించడానికి కారణం అదే…

రానా నాయుడు సిరీస్ లో కీలక పాత్రల్లో వెంకటేష్, రానా నటించడం వల్ల తెలుగులో ఈ సిరీస్ కి బాగా హైప్ వచ్చింది. కానీ అందులో బూతులు అసందర్బంగా రావడం మితి మీరిన అడల్ట్ కంటెంట్ ఉండటం వల్ల కామన్ ప్రేక్షకులు ముఖ్యంగా ఫామిలీస్ ఆ సిరీస్ కు దూరమయ్యారని అనలిస్ట్ దాము బాలాజీ పేర్కొన్నారు. అందువల్లే ఇన్నేళ్లుగా వెంకీ మీద ఉన్న సాఫ్ట్ కార్నర్ మొత్తం పోయిందని ఒక్క సిరీస్ తో నెగిటివిటీని మూటగాట్టుకున్నాడు అంటూ చెప్పారు.

మొదటి సారి ఇలా నెట్ ఫ్లిక్స్ రీజనల్ భాషలో సిరీస్ ను తీసేయడం. అయితే తెనుగులో తీసేసినా ప్రేక్షకులు ఈ సిరీస్ ను ట్రోల్ చేయడం ఆపేలా లేరు అంటూ ఆయన అభిప్రాయపడ్డారు. అంతకుముందు వచ్చిన ‘మీర్జాపూర్’ వంటి సిరీస్ లలో కూడా బూతులు ఉన్నాయి. కానీ సందర్భం లేకుండా బూతులు రావలసిందే అన్నట్లుగా ఇందులో మాట్లాడారు. మరీ ముఖ్యంగా ఆడవాళ్లు కూడా బూతులు ఎక్కువగా మాట్లాడటం బాగోలేదని విమర్శించారు బాలాజీ.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago