Categories: FeaturedMovie News

Hero Raviteja : బైక్ లో పెట్రోల్ పోయించలేక ఇంజన్ ఆపేసేవాడిని…: హీరో రవితేజ

Hero Raviteja : మాస్ మహారాజ్ గా పేరు తెచ్చుకున్న రవితేజ కు ఆ పేరు అంత ఈజీగా ఏమీ రాలేదు. కష్టపడి చిన్న చిన్న వేషాలు సినిమాల్లో వేస్తూ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ హీరోగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నేడు ఈ స్థాయికి ఎదిగాడు. సినిమాల్లో అవకాశం రావడం ఒకెత్తయితే దాన్ని నిలబెట్టుకోవడం మరో ఎత్తు. రవితేజ హీరోగా ఎన్నో హిట్స్ అలాగే ఫ్లాప్స్ రెండిటినీ చూసినా ఆయనకున్న స్టార్ డమ్, ఫ్యాన్ బేస్ ను మాత్రం పోగొట్టుకోలేదు. ఏ ఇంటర్వ్యూలో అయినా నాకు మెసేజ్ ఇవ్వడం రాదు, చెప్పను ఎవడికి వాడు తెలుసుకోవాలి అంటూ చెప్పే రవితేజ గురించి డైరెక్టర్ హరిశ్ శంకర్ ఒక ఇంట్రస్టింగ్ విషయాన్ని పంచుకున్నారు.

పెట్రోల్ కి డబ్బు లేక ఇంజిన్ ఆపేసేవాడిని…

స్వయంకృషితో కష్టపడి పైకి వచ్చినవాళ్ళలో రవితేజ నేటి తరానికి ఆదర్శం. అంతే కాకుండా తాను కష్టపడి పైకి వచ్చాను అంటూ ఎక్కడా డబ్బా కొట్టుకోడు రవితేజ. ఎక్కడైనా ఇంటర్వ్యూలలో కానీ మీడియా మీటింగులో కానీ అభిమానులకు సందేశాలివ్వడం లాంటివి కూడా చేయడు మాస్ రాజా. నేను ఎవరికీ మెసేజ్లివ్వను ఎవడికి వాడు తెలుసుకోవాలి అంటూ చెబుతాడు. అలాంటి రవితేజ గురించి ఒక ఇంటరెస్టింగ్ విషయాన్ని డైరెక్టర్ హరిశ్ శంకర్ పంచుకున్నారు. రవితేజ సినిమాల్లో అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరుగుతున్న సమయంలో ప్రసాద్ ల్యాబ్ దగ్గర ఇంజిన్ ఆపేసుకుని పంజాగుట్ట వరకు వచ్చేవాడట.

అలా అయితే పెట్రోల్ ఆదా చేయొచ్చని అలా చేసేవాడట రవితేజ. అప్పట్లో కేవలం ఒక లీటర్ పెట్రోల్ వేయించుకుని అవకాశాల కోసం తిరిగేవాడట రవితేజ. పాంచ్ పాయింట్ అంటారు అలా ఒక లీటర్ పెట్రోల్ కొట్టించడాన్ని అంటూ చెప్పారు రవితేజ. అయితే అలా అవస్థలు పడిన రోజు నుండి నేడు మాస్ మహారాజ్ గా ఎదిగినా కూడా నాకేం ఫీలింగ్ లేదని చెబుతారు రవితేజ. గతంలో భాదపడ్డామని, దెబ్బలు తిన్నామని ఈరోజు అవి గుర్తు చేసుకోను. అపుడు ఇబ్బందులు పడింది నాకోసమే కదా నేనేమన్నా దేశానికి స్వాత్రంత్రం తేవడానికి కష్టపడ్డానా చెప్పుకోడానికి, అందుకే సక్సెస్ ని సెలెబ్రేట్ చేసుకోడానికి ఇష్టపడను అంటూ రవితేజ చెప్పారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago