Featured

Analyst Damu Balaji : వైసీపీ వాళ్ళు నన్ను చంపేస్తారు… కడప ఎస్పీతో దస్తగిరి…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : వివేకానంద రెడ్డి మరణించి నాలుగేళ్లు కావొస్తున్నా చంపింది ఎవరనే విషయాలు స్పష్టంగా ఇప్పటికీ తెలియరాలేదు. ఏపీ సీఎంకి సొంత బాబాయ్ అయినా ఎవరు చంపారో ఇప్పటికీ తెలియక పోవడం పట్ల అటు విపక్షాల నుండి గట్టి విమర్శిలే ఎదుర్కొంటున్న జగన్, ఇంట్లోనే హంతకులున్నారనే కథనాలు వినిపిస్తున్న విమర్శకు కౌంటర్లు వేస్తున్నారే కానీ కేసులో మాత్రం పురోగతి లేదు. రోజుకో పేరు బయటికి వస్తోంది, ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు అంటూ వార్తలు వినిపించినా అవేవి జరగలేదు. అయితే తాజాగా ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి ని వైసీపీ టార్గెట్ చేసిందని ఆయన భార్య షబానా ఆరోపిస్తున్నారు. ఇక ఈ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

జగన్ నన్ను చంపిస్తాడు…

వివేకానంద రెడ్డిని తానే హత్య చేసానంటూ అప్రూవర్ గా మారిన దస్తగిరి వాంగ్మూలం ప్రకారమే సిబిఐ విచారణ జరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురుని ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి తో సహా అరెస్టు చేసి రిమాండ్ ఖైదీలుగా ఉంచారు. నెలలు గడుస్తున్నా విచారణ ఒక కొలిక్కి రావడం లేదు. కేసులో దస్తగిరి వల్లే వాళ్లందరూ జైలులో ఉన్నారనే పగతో మమల్ని వైసీపీ వాళ్ళు వేధిస్తున్నారు అంటూ దస్తగిరి అలాగే అతని భార్య ఆరోపిస్తున్నారు అంటూ బాలాజీ తెలిపారు.

అయితే దస్తగిరి పూటకో మాట మాట్లాడుతున్నాడని, ఎవరూ తనని ఏమి చేయలేరని, తనకు ఐదుగురు పోలీసులతో సెక్యూరిటీని కోర్ట్ ఇచ్చిందని, నేను ఎవరికీ భయపడటం లేదని చెప్తున్నాడని బాలాజీ అభిప్రాయపడ్డారు. ఒక్కోసారి ఒక్కలాగా దస్తగిరి మాట మారుస్తున్నాడు. మరోవైపు కడప ఎస్పీ వద్దకు వెళ్లి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసాడని బాలాజీ తెలిపారు. నిజానికి వైసీపీ వాళ్ళు ఆయన జోలికి వెళ్లకపోయినా మీడియా అటెన్షన్ కోసం దస్తగిరి ఇలా చేస్తుండవచ్చు అంటూ బాలాజీ తెలిపారు.

Bhargavi

Recent Posts

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉచిత బ్యాంక్ కోచింగ్ ప్రారంభం

తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…

1 day ago

ప్రభాస్, రవితేజతో హిట్స్.. కానీ కెరీర్‌ను వదిలేసిన హీరోయిన్

టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…

1 day ago

నాగార్జున నమ్మకం లేకపోతే ఆర్జీవీ కెరీర్ ముగిసేది: జేడీ

టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…

1 day ago

బాల్య వివాహం ఆపాలని వెళ్లి.. తప్పు బాలికను తీసుకెళ్లిన అధికారులు

తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…

1 day ago

‘టాక్సిక్’లో కొత్త కోణం.. దర్శకురాలిపై యశ్ ప్రశంసలు

కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…

1 day ago

కేసీఆర్‌కు సవాల్.. కవిత కొత్త పార్టీ ప్రకటన

తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…

1 day ago