Featured

Analyst Damu Balaji : సోనూ సూద్ కి ఆ డబ్బులన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : విలన్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన నటుడు సోనూ సూద్. హ్యాండ్సప్ అనే సినిమా ద్వారా తెలుగులో అడుగుపెట్టిన సోనూ సూద్ ఆ తరువాత నాగార్జున సినిమా సూపర్ ద్వారా లైం లైట్ లోకి వచ్చాడు. ఇక ఆ సినిమా తరువాత వరుసగా తెలుగులో విలన్ గా నటించిన సోనూ సూద్ ముఖ్యంగా ‘అరుంధతి’ లో పశుపతిగా మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే సినిమాల్లో నెగెటివ్ రోల్ లో కనిపించే సోనూ సూద్ నిజ జీవితంలో మాత్రం తాను చేసిన సేవ కార్యక్రమాల ద్వారా హీరో అనిపించుకున్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో సోనూ సూద్ బాగా హెల్ప్ చేసారు. అయితే అసలు సోనూ సూద్ బ్యాక్ గ్రౌండ్ ఏమిటి, ఎందుకని కోట్లకు కోట్లు దానాలు చేస్తున్నారు, ఈయన వెనుక ఉన్నది ఎవరు లాంటి విషయాలను అనలిస్ట్ దాము బాలాజీ తెలిపారు.

సోనూ సూద్ ఇలాంటి హెల్ప్స్ చేయడానికి కారణం…

నటుడుగా అవ్వకముందు నుండే సోనూ సూద్ ఎగువ మధ్య తరగతికి చెందిన కుటుంబం కావడం వల్ల ఎపుడు డబ్బుకు లోటు లేదు. ఇక ముంబై లో వ్యాపారాలను చేసే కుటుంబం కావడం వల్ల బాగా స్థిరపడ్డారు. సోనూ సూద్ ఇంకమ్ టాక్స్ దాదాపు 130 కోట్లు ఫైల్ చేస్తారు అంటూ బాలాజీ తెలిపారు. ఆయన సినిమాల్లో సంపాదించే దానికన్నా ఎక్కువ వ్యాపారాల్లో వస్తుందంటూ తెలిపారు. జూహి బీచ్ కి సమీపంలో ఆయనకున్న ఆరంతస్థుల భవనంను హోటల్ గా మార్చేశారు. ఆ విషయంలో పోలీస్ కేసు కూడా కాగా మళ్ళీ సద్దుమనింగింది. ఒకసారి ఒక అమ్మాయి ఆరోగ్యం విషయంలో చిన్న సహాయం చేసినందుకు ఆ అమ్మాయి కుటుంబం మొత్తం కాళ్ళ మీద పడి కృతజ్ఞతలు చెప్పడం తనను కదిలించిందని అప్పటి నుండి సమాజానికి సహాయం చేయాలని సోనూ సూద్ భావించినట్లు బాలాజీ తెలిపారు.

అయితే ముఖ్యంగా కరోనా సమయంలో ఈయన ఎక్కువగా సహాయం చేసి వార్తల్లో నిలిచారు. ఇక పాలిటిక్స్ లోకి రావాలని సోనూ సూద్ భావిస్తున్నాడు అందుకే ఇలా సోషల్ సర్వీస్ చేస్తున్నాడని వార్తలు వచ్చినా తనకు ఆసక్తి లేదని సోను చెప్పేసారు. ఇక తన వెనుక ఎవరో ఉండి కావాలనే చేయిస్తున్నారనే వార్తలు వినిపించినా అవన్నీ కూడా అపద్దాలే అని బాలాజీ క్లారిటీ ఇచ్చారు. ఇంతకు ముందు కూడా ఎన్నో సోషల్ సర్వీస్ కి సంబంధిచిన కార్యక్రమాలు సోనూ సూద్ చేసినా కరోనా సమయంలో బాగా పాపులర్ అయ్యాడని ప్రస్తుతం కొంచం సైలెంట్ గా ఉన్నాడని బాలాజీ తెలిపారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago