Featured

Analyst Damu Balaji : ఆకాశమంత అంబేద్కర్ విగ్రహం… దాని కింద ఆరు సెక్రట్ గదులు… అది నిజమేనా…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : భారత రాజ్యాంగ రూపకర్త బిఆర్ అంబేద్కర్ 132 వ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 14 శుక్రవారం నాడు హైదరాబాద్ లో 125 అడుగుల ఎతైన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎప్పటి నుండో ఎదరుచూస్తున్న గట్టం నేడు ఆవిష్కృతం అవగా మొత్తం 119 నియోజకవర్గాల నుండి 35 వేలకు పైగా జనంకు ఈ వేడుకలో చోటు కల్పించారు. దాదాపు 145 కోట్ల రూపాయల వ్యయంతో 360 టన్నులకు పైగా ఉక్కు, 100 టన్నుల కాంస్యంతో తయారు చేసిన ఈ విగ్రహం దేశంలోనే అంబేద్కర్‌ విగ్రహాలలో అత్యంత ఎత్తైనది. అంబేద్కర్ మనుమడు ప్రకాష్ అంబేద్కర్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి బౌద్ధ సన్యాసుల కీర్తనల మధ్య ఆవిష్కర జరిగింది. ఇక ఈ ఆవిష్కరణ గురించి పక్కన పెడితే ఈ విగ్రషజం కింద ఉన్న పార్లమెంట్ భవనం కింద ఆరు గదులు ఉన్నాయని, అవి సీక్రెట్ గా ఉంచారనే వదంతులు వినిపిస్తున్నాయి. దీని గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

ఆరు సీక్రెట్ గదులు… అందులో ఏమున్నాయ్…

దేశంలోని అంబేద్కర్ విగ్రహాలలో ఎత్తయిన విగ్రహం కాగా గుజరాత్ లోని సర్ధార్ వల్లభభాయ్ పటేల్ విగ్రహం తరువాత రెండవ ఎత్తయిన విగ్రహం కావడం విశేషం అంటూ బాలాజీ తెలిపారు. సర్ధార్ వల్లభభాయ్ పటేల్ విగ్రహం తయారు చేసిన రామ్ వుంజి సుటర్ గారే అంబేద్కర్ విగ్రహాన్ని కూడా తయారు చేయడం విశేషం. ఇక దాదాపు రెండేళ్ల పాటు శ్రమించి చేసిన ఈ విగ్రహం కింద పార్లమెంట్ భవనం నమూనా ఉంటుంది. అందులో మూడంతస్థులు ఉండగా మ్యూజియం, థియేటర్, లైబ్రరీ ఉంటాయని ఇక చుట్టూ అందమైన పార్కులు ఏర్పాటు చేసారంటూ బాలాజీ తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి కూడా అంబేద్కర్ కారణం, ఆయన రాసిన రాజ్యాంగములోని మూడవ ఆర్టికల్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు గురించి చెబుతుందని కెసిఆర్ తన స్పీచులో తెలపడం గురించి బాలాజీ వివరించారు. ఇక పార్లమెంట్ భవనం కింద వైపు ఆరు గదులు ఉన్నాయని వాటిని సీక్రెట్ గా ఉంచారని వదంతుల గురించి మాట్లాడుతూ అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చారు. అది పబ్లిక్ ప్రాపర్టీ కావున అలా సీక్రెట్ గా ఏదో చేసే అవకాశం లేదని తెలిపారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago