Vignesh Shivan: సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన నయనతార వివాహం తర్వాత కూడా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. నయనతార లవ్ ఎఫైర్స్ గురించి అనేక వార్తలు వినిపించాయి. కొంతకాలం హీరో శింబుతో ప్రేమాయణం నడిపిన నయనతార ఆ తర్వాత అతనికి బ్రేకప్ చెప్పి ప్రభుదేవని ప్రేమించి పెళ్లి పీటల వరకు వెళ్ళింది. అయితే కొన్ని కారణాలవల్ల ప్రభుదేవాతో పెళ్లి రద్దు చేసుకొని చాలాకాలం ఒంటరిగా మిగిలిపోయింది.
కొంతకాలానికి డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో ప్రేమలో పడింది. దాదాపు ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకున్న వీరిద్దరూ గతేడాది మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఇక ఇటీవల సరోగసి పద్ధతి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చి తల్లిదండ్రులుగా మారారు. ఇదిలా ఉండగా తాజాగా విగ్నేష్ శివన్ నయనతార తో తన ప్రేమ మొదలైన క్షణాల గురించి వివరించాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విఘ్నేష్ శివన్ మాట్లాడుతూ.. “డైరక్టర్ గా నా మొదటి సినిమా పోడా పోడి.
మొదటి సినిమాతోనే పరాజయం ఎదురయింది. ఆ తర్వాత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ సమయంలో “నేనూ రౌడీనే” సినిమా కథ రాశాను. ధనుష్ కి కథ నచ్చటంతో ఆయనే నిర్మాతగా మారాడు అంటూ విగ్నేష్ వెల్లడించాడు. ఆ తర్వాత నయనతార ని కలిసి కథ చెప్పమని ధనుష్ పంపించాడు. అయితే నయనతార అంగీకరించదేమో అని నజ్రియాని హీరోయిన్గా తీసుకుందామని భావించాను.
ధనుష్ చెప్పాడని నయన్ దగ్గరికి వెళితే ఆమె నన్ను ఎంతో గౌరవించింది. ఆ క్షణమే నేను నయన్ తో ప్రేమలో పడిపోయా అంటూ విగ్నేష్ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత సినిమా షూటింగ్ ప్రారంభమైన సెకండ్ షెడ్యూల్ నుంచే మేము డేటింగ్ లో ఉన్నాం. కానీ మా ప్రేమ గురించి ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డాను. మేము డేటింగ్ లో ఉన్న తర్వాత కూడా నయన్ ని మేడం అనే పిలిచేవాడిని. అంతేకాకుండా ఆమె కెరవాన్ దగ్గరికి కూడా ఎప్పుడు వెళ్లలేదు. ఇలా చాలా కాలం మా ప్రేమని రహస్యంగా ఉంచాము అంటూ విఘ్నేష్ వెల్లడించాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…