Analyst Damu Balaji : సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకాలం మామూలుగా వినిపించేదే. ఇంతకు ముందు బాలీవుడ్ లో ఎక్కువగా వినిపించే డ్రగ్స్ కల్చర్ ఇప్పుడు సౌత్ లోనూ బాగా పాకిపోయింది. అయితే ఇది కేవలం సినిమా ఇండస్ట్రీలోకి మాత్రమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో స్టూడెంట్స్ కూడా ఎక్కువగా డ్రగ్స్ తీసుకుంటున్నట్లు తెలుస్తున్నాయి. అయితే తాజాగా ఒక టాలీవుడ్ ప్రొడ్యూసర్ డ్రగ్స్ కేసులో పట్టుబడటంతో మరోసారి ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసు గురించి వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.
ఆ ప్రొడ్యూసర్ ఫోన్లో చాలా మంది సెలబ్రిటీలు…
తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ఒక డిస్ట్రిబ్యూటర్ అలాగే ప్రొడ్యూసర్ అయిన సుంకర కృష్ణ ప్రసాద్ చౌదరి అనే వ్యక్తి డ్రగ్స్ కేసులో అరెస్టు అయ్యారు. కబాలి సినిమా తెలుగు ప్రొడ్యూసర్ గా ఉన్న సుంకర కేపీ చౌదరి తాజగా డ్రగ్స్ కేసులో పట్టుబడటం కలకలం రేపింది అంటూ బాలాజీ తెలిపారు. ఆయన వద్ద 300 గ్రాముల కోకైన్ దొరికింది. ఆయన ద్వారా డ్రగ్స్ సప్లై చేస్తున్న నైజీరియన్ దేశస్తుడి వివరాలను కూడా పోలీసులు రాబట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక కేపీ చౌదరి ఫోన్ ను స్వాదినం చేసుకున్న పోలీసులు అందులో దాదాపు 7000 ఫోటోలు ఉన్నట్లు గుర్తించారు.
అందులో పలువురు రాజకీయనాయకులు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నట్లు తెలిపారు. ప్రముఖంగా తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి, ఆమె కూతురు, ఆర్టిస్ట్ జ్యోతి అలాగే యాంకర్ అషు రెడ్డి ఫోటోలు లభ్యం అయ్యాయి. ముఖ్యంగా అషురెడ్డి తో ఫోన్ కాల్స్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు అంటూ బాలాజీ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ విషయంలో సీపీ ఆనంద్ నేతృత్వంలో అవగాహనా కార్యక్రమం నిర్వహించాలని ప్లాన్ చేసారు. సీపీ ఆనంద్ గారు జిల్లాలనుండి చదుకుంటున్న స్టూడెంట్స్ ను సెలక్ట్ చేసి డ్రగ్స్ కంట్రోల్ మీద వాటిని తీసుకోకుడదని ప్రచార కార్యక్రమాలను నిర్వహించబోతున్నారు. అందుకు హీరో నిఖిల్ ను కూడా ప్రచార కార్యక్రమాలకు పిలిచారు. డ్రగ్స్ తీసుకోరాదంటూ చెప్పిన నిఖిల్ ఆసక్తికర వాఖ్యలను చేశాను. తాను పార్టీస్ కి ఎక్కువగా వెళ్తుంటానని అక్కడ తన తోటి యాక్టర్స్ డ్రగ్స్ తీసుకోమని చెబుతుంటారు కానీ నేను ఎపుడూ తీసుకోలేదని చెప్పారు. మాదక దృవ్యాలు అంటే మరణం అనే అర్థం అంటూ ఒకసారి వాటిని తీసుకుంటే ఇక బానిస అయిపోతామని, వాటికి దూరంగా ఉండాలని తెలిపారని, అయితే టాలీవుడ్ లో చాలా మంది డ్రగ్స్ తీసుకుంటున్నట్లు ఈ విషయంతో తెలుస్తోందని బాలాజీ అభిప్రాయపడ్డారు.
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…