Ananya Nagalla: ప్రియదర్శి హీరోగా తెరకెక్కిన మల్లేశం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నటి అనన్య నాగళ్ళ.మొదటి సినిమాతోనే తన నటనతో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కీలక పాత్రలో నటించి సందడి చేశారు. ఇక ఈ సినిమా ద్వారా మరింత గుర్తింపు సంపాదించుకున్న అనన్య ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నారు.
తాజాగా గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన శాకుంతలం సినిమాలో కూడా ఈమె ఓ పాత్రలో నటించి మెప్పించారు.సినిమాల విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈమె ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె తాజాగా అభిమానులతో కలిసి సరదాగా ముచ్చటించారు.
ఈ క్రమంలోనే ఒక నెటిజన్ నీ బాయ్ ఫ్రెండ్ పేరు ఏంటి తన ఇన్ స్టా ఐడి ఇవ్వు అంటూ తనని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ.. నాకు బాయ్ ఫ్రెండా అంత సీన్ లేదు భయ్యా.. అందరూ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారనుకొని ఎవరు తనకు ప్రపోజ్ చేయడం లేదు అదే ప్రాబ్లమ్ అనుకుంటా అంటూ సమాధానం చెప్పారు.
ఇలా తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారనుకోని ఎవరు తనకు ప్రపోజ్ చేయలేదంటూ ఈ సందర్భంగా ఈమె చేస్తున్నటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మరొక నేటిజన్ తన వాట్సాప్ డీపీ ఏంటి అని ప్రశ్నించగా ఆమె తన ఫోటోని ప్రొఫైల్ పెట్టుకున్నట్టు తెలియజేశారు. ఇలా బాయ్ ఫ్రెండ్ గురించి అనన్య చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…