Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చలకు దారితీసింది.ఇలా ఈమె సోషల్ మీడియాలో హీరో విజయ్ దేవరకొండను ఉద్దేశించి పరోక్షంగా పోస్ట్ చేసిందని భావిస్తున్నారు. లైగర్ సినిమా ఫ్లాప్ కావడంతోనే అనసూయ ఇలాంటి ట్వీట్ చేశారని పెద్ద ఎత్తున విజయ్ అభిమానులు భావిస్తూ అనసూయను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
అనసూయ విజయ్ దేవరకొండ గురించి ఇలాంటి ట్వీట్ చేయడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే… సరిగ్గా కొన్ని సంవత్సరాల క్రితం విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమాలో భాగంగా విజయ్ దేవరకొండ అమ్మ గురించి మాట్లాడిన మాటలు పెద్ద ఎత్తున వివాదం సృష్టించాయి. ఆ సమయంలో అనసూయ సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున మండిపడ్డారు.
ఇక ఆ విషయం గురించి అందరూ మర్చిపోగా తాజాగా మరోసారి అనసూయ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని గుర్తు చేస్తూ పెద్ద ఎత్తున వివాదానికి తెర తీశారు.ఆగస్టు 25వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో లైగర్ సినిమా విడుదల కావడం ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో అనసూయ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ… అమ్మను అన్న ఉసురు ఊరికే పోదు.. కర్మ కొన్నిసార్లు రావడం ఆలస్యం కావచ్చేమో కానీ రావడం మాత్రం పక్క అంటూ ఈ సందర్భంగా ఈమె ట్వీట్ చేశారు.
ఈ విధంగా అనసూయ ట్వీట్ చేయడంతో ఈమె విజయ్ దేవరకొండ సినిమా ఫ్లాప్ కావడంతోనే అప్పట్లో అన్న మాటలకు ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారని, పరోక్షంగా తనని ఉద్దేశించే ట్వీట్ చేశారని పలువురు భావిస్తున్నారు.ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ అభిమానులు అనసూయ సైతం జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎన్నో డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడటమే కాకుండా అలాంటి డైలాగులు వేసినప్పుడు వెకిలి నవ్వులు నవ్వారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అలా జబర్దస్త్ కార్యక్రమంలో డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాతూ డబ్బు సంపాదించిన అనసూయ ఇప్పుడు నీతులు చెబుతుంది అంటూ విజయ్ అభిమానులు పెద్ద ఎత్తున ఈమెపై కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…