Featured

Vijay Devarakonda: యాటిట్యూడ్ కన్నా కంటెంట్ అవసరం… హిట్టు కొడితేనే యాటిట్యూడ్ కి అర్థం.. విజయ్ పై నేటిజన్స్ కామెంట్!

Published

on

Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ వ్యవహార శైలి ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. ఈయన తన సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ఎంతో భిన్నంగా చేస్తూ ఉంటారు.ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ హీరో చూపించే యాటిట్యూడ్ కొందరికి మంచిగా అనిపించిన మరికొందరికి ఏమాత్రం నచ్చలేదని చెప్పాలి.

ఇకపోతే లైగర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా విజయ్ దేవరకొండ చూపించిన యాటిట్యూడ్ కు యూత్ ఫిదా అయ్యారు.అయితే ఇలాంటి యాటిట్యూడ్ చూపించాలంటే సినిమా హిట్ కొడితేనే తన చూపించే యాటిట్యూడ్ అర్థం ఉంటుంది లేదంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాంటి ఇబ్బందులను ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఎదుర్కొంటున్నారు.

Advertisement

ఈ హీరోకి హిట్టు వచ్చి దాదాపు నాలుగు సంవత్సరాలు అవుతుంది. గీతగోవిందం తర్వాత ఈయన నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. అయితే ఈ హీరో మాత్రం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పెద్ద ఎత్తున తన యాటిట్యూడ్ చూపిస్తూ ప్రమోషన్స్ నిర్వహించారు. ఈ క్రమంలోనే లైగర్ విషయంలో కూడా కాళ్లు పైకి పెట్టుకోవడం బాయ్ కాట్ అంటే కొట్టేయడమే అంటూ ఎంతో భిన్నంగా సినిమాని ప్రమోట్ చేశారు.

Vijay Devarakonda: కథ ఎంపిక విషయంలో పొరబడుతున్న విజయ్…

అయితే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్లాప్ టాక్ సొంతం చేసుకోవడంతో పెద్ద ఎత్తున యాంటీ ఫ్యాన్స్ మనం చేసే సినిమాలో కంటెంట్ ఉన్నప్పుడే యాటిట్యూడ్ చూపించాలి, సినిమా హిట్ అయితేనే దానికి ఒక అర్థం ఉంటుంది ఈ విషయం నీకు అర్థం కావట్లేదు అంటూ పెద్ద ఎత్తున ఈయనపై కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఎన్నో అంచనాలు నడుమ విడుదలైన ఈ సినిమా విజయ్ దేవరకొండకు చేదు అనుభవాన్ని మిగిల్చిందని చెప్పాలి.

Advertisement

Trending

Exit mobile version