Categories: FeaturedMovie News

Chiranjeevi Sarja Wife: రేపటి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు.. రెండో పెళ్లి వార్తలపై స్పందించిన మేఘనారాజ్?

Chiranjeevi Sarja Wife:సీనియర్ నటుడు అర్జున్ మేనల్లుడిగా కన్నడ చిత్ర పరిశ్రమంలోకి అడుగు పెట్టారు నటుడు చిరంజీవి సర్జా. ఈయన కన్నడ చిత్ర పరిశ్రమలో ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్న సమయంలోనే ఈయన మరొక నటి మేఘన రాజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ఇలా 2018లో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన చిరంజీవి తన వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు.

ఈ దంపతుల అన్యోన్యత చూసి కాలమే కుళ్ళుకుంది కాబోలు పెళ్లయిన రెండు సంవత్సరాలకే చిరంజీవి గుండెపోటుతో మరణించడం ఒక్కసారిగా ఆయన అభిమానులను ఎంతగానో కృంగదీసింది. పెళ్లయిన రెండు నెలలకి భర్తను కోల్పోవడంతో మేఘన పరిస్థితి కూడా ఆ గమ్య గోచరంగా మారిపోయింది. అయితే ఆయన మరణించే సమయానికి మేఘన ఐదు నెలల గర్భవతి కావడం గమనార్హం.

ఈ విధంగా అతి చిన్న వయసులోనే భర్తను కోల్పోయి తన ప్రతిరూపాన్ని కడుపులో మోస్తూ ఆ బాధ నుంచి బయటపడలేక పోయిన మేఘన తన కుమారుడు పుట్టిన తరువాత తన కొడుకులో తన భర్త ప్రతిరూపాన్ని చూసుకుంటూ తన కొడుకు ఆలనా పాలన చూసుకుంటుంది.ఇప్పుడిప్పుడే తన భర్త లేరన్న వార్త నుంచి బయటపడిన ఈమె తిరిగి సినిమాలలో బిజీ అవ్వడమే కాకుండా పలు కార్యక్రమాలకు న్యాయ నిర్ణయితగా వ్యవహరిస్తున్నారు.ఇక మేఘన రెండవ వివాహం చేసుకోబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి అయితే తాజాగా ఈ వార్తలు పై స్పందించిన ఈమె రెండో పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు.

Chiranjeevi Sarja Wife: రెండో పెళ్లి వార్తలపై స్పందించిన మేఘన రాజ్…

ఈ సందర్భంగా మేఘన రాజ్ మాట్లాడుతూ తన భర్త మరణం తర్వాత చాలామంది తనకు రెండో పెళ్లి చేసుకోమని చెప్పారు అలాగే మరికొందరు బాబును చూసుకుంటూ ఉండమని సలహా ఇచ్చారు. అయితే తన భర్త తనకి ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉండేవాడు.. ఈ ప్రపంచం నీ గురించి ఏమనుకుంటుందో ఆలోచించడం మానేసి మనకు నచ్చినది చేయమని చెప్పేవాడు.అయితే రేపు ఏం జరగబోతుందో అనే దాని గురించి తాను ఎప్పుడూ ఆలోచించలేదని ఈ సందర్భంగా ఈమె తన పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago