Anasuya:బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు పొందిన ఈమె ప్రస్తుతం బుల్లితెరకు దూరమై వరుస సినిమా అవకాశాలతో బిజీగా ఉండిపోయారు.
ఇలా పలు సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇకపోతే ఈమె సోషల్ మీడియాలో చేసే కొన్ని పోస్టులు కారణంగా నేటిజన్ల ట్రోలింగ్ కి గురవుతూ ఉంటారు. ఇలా నేటిజన్స్ తనని ట్రోల్ చేసినప్పటికీ ఈమె ఘాటుగా స్పందిస్తూ వారికి తన స్టైల్ లో సమాధానం చెబుతుంది.
ఈ క్రమంలోనే లైగర్ సినిమా విడుదల సమయంలో ఈమె విజయ్ దేవరకొండను ఉద్దేశిస్తూ పరోక్షంగా చేసినటువంటి పోస్ట్ పై విజయ్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.ఈ క్రమంలోనే అనసూయను ఆంటీ అంటూ భారీగా ట్రోల్ చేశారు. అప్పట్లో ఈ వివాదం సంచలనంగా మారింది. ఈ విషయంపై అనసూయ ఏకంగా సైబర్ క్రైమ్ పోలీసులను కూడా ఆశ్రయించిన విషయం మనకు తెలిసిందే.
అయితే తాజాగా మరోసారి ఆంటీ వివాదం పై అనసూయ స్పందించారు.అభిమానులతో సరదాగా ముచ్చటించిన అనసూయకు ఒక అభిమాని నుంచి ప్రశ్న ఎదురయింది. ఎందుకు అక్క మీకు ఆంటీ అంటే అంత కోపం అంటూ అనసూయని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ… తనకు ఆంటీ అనే పదం అసలు నచ్చదని తెలిపారు. ఎందుకంటే ఆ పిలుపు వెనుక వేరే అర్థం ఉంటుందని ఈమె తెలిపారు. అయితే ప్రస్తుతం తనకు కోపం రావడం లేదని ఎందుకంటే ట్రోలర్స్ ను చక్కదిద్దే అంత సమయం తనుకు లేదని అంతకన్నా ముఖ్యమైన పనులు తనకు ఉన్నాయి అంటూ ఈ సందర్భంగా అనసూయ చెప్పినటువంటి ఈ సమాధానం ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…