anasuya
బుల్లితెర యాంకర్ లలో ఓ వెలుగు వెలుగుతున్న వారి లో అనసూయ ఒకరు. ఈ యాంకరమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకవైపు పలు టీవీ కార్యక్రమాలను చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. అదేవిధంగా పలు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే అనసూయ ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగస్వామ్యం అయ్యారనే వార్తలు వినిపించాయి. అది కూడా వార్నింగ్ ఇచ్చిమరీ ఈ ప్రాజెక్టును పట్టేసినట్లు తెలుస్తుంది.
వెండితెరపై యాంకర్ కు ఇంతటి క్రేజ్ రావడానికి గల కారణం దర్శకుడు సుకుమార్. సుకుమార్ దర్శకత్వం వహించిన రంగస్థలం సినిమాలో ఎంతో ప్రతిష్టాత్మకమైన రంగమ్మత్త పాత్రను అనసూయకి కల్పించడంతో ఈ పాత్ర ద్వారా అనసూయ వెండితెరపై ఓ వెలుగు వెలుగుతోంది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప సినిమాలో కూడా అనసూయ కీలక పాత్రలో నటిస్తున్నట్లు గతంలో వార్తలు బలంగా వినిపించాయి. అయితే అవన్నీ కేవలం అపోహలు మాత్రమేనని స్వయంగా అనసూయ చావు కబురు చల్లగా ఈవెంట్ లో తేల్చిచెప్పారు.
అదేవిధంగా ఈ సినిమా ఈవెంట్ లో స్టేజ్ పైనే అందరూ పుష్ప సినిమాలో నటిస్తున్నారా? అని అడుగుతున్నారు. కానీ ఆ సినిమాలో నేను చేయడంలేదని చెబుతున్నా, కానీ నాకు బన్నీతో నటించాలని కోరిక ఉంది. బన్నీతో నటించే ఛాన్స్ నాకు ఇవ్వాల్సిందే అంటూ దర్శకుడు సుకుమార్ కి, హీరో అల్లు అర్జున్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.
అనసూయ ఇచ్చిన ఈ స్వీట్ వార్నింగ్ బాగానే పని చేసినట్లు తెలుస్తోంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప సినిమాలు ఓ కీలకమైన పాత్రలో నటించే అవకాశాన్ని అనసూయకు కల్పించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అనసూయ పాత్రకి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ లో జరిగినట్లు తెలుస్తోంది. ఈ షూటింగ్ కి సంబంధించిన సుకుమార్ ఆ వీడియోను షేర్ చేశారు. ఈ విధంగా వీడియో షేర్ చేయడంతో అనసూయ పుష్ప సినిమాలో నటిస్తున్నారనే విషయంపై క్లారిటీ ఇచ్చారు.ఎట్టకేలకు అనసూయ వార్నింగ్ ద్వారా బన్నీతో నటించాలనే తన కోరిక నెరవేరింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…