Movie News

Darja Review: మాస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన అనసూయ!

యాంకరింగ్ తో బుల్లి తెరపై యూత్ ని అలరించిన యాంకర్ అనసూయ ఇప్పుడు దర్జా గా వెండితెర మీద అలరించడానికి రెడీ అయింది. ఇందులో కమెడియన్ కం హీరో సునీల్ ఓ ముఖ్యమైన పాత్ర పోషించారు. సునీల్ తో పాటు ఈ చిత్ర కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌ నిర్మాత రవి పైడిపాటి ఓ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రానికి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ సమర్పణ. పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రంగా తెరకెక్కింది. ఈ చిత్రానికి సలీమ్ మాలిక్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని శివశంకర్ పైడిపాటి నిర్మించారు. కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా రవి పైడిపాటి వ్యవహరించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి లేడీ ఓరియెంటెడ్ పాత్రకు అనసూయ ఏమాత్రం న్యాయం చేసిందో చూద్దాం పదండి.

కథ: బందరు కనకం అలియాస్ కనక మహాలక్ష్మి (అనసూయ) అంటే బందరు చుట్టు పక్కల గ్రామాల ప్రజలకు హడల్. పోలీస్ యంత్రాంగాన్ని సైతం తన రౌడీయిజంతో శాసిస్తు తన గుప్పెట్లో పెట్టుకుని దందా సాగిస్తుంటుంది. ఈ క్రమంలో గణేశ్ (అరుణ్ వర్మ) తను ప్రేమించిన అమ్మాయి పుష్ప(శిరీష) చేతిలో మోసపోయి ఉరేసుకుని చనిపోతాడు. తన అన్న చావుకి కారణం అయిన పుష్పని… గణేశ్ తమ్ముడు రంగ (షమ్ము) చంపాలని చూస్తుండగా… కొత్తగా వచ్చిన బందరు ACP శివ శంకర్ పైడిపాటి(సునీల్) అడ్డుకుని.. ఆ కేసు విచారణ చేపడతాడు. మరి గణేష్ చనిపోవడానికి కారణం పుష్ప మోసం చేయటం వల్లనేనా? బందరు కనకం ఆగడాలను ACP ఎలా ఆట కట్టించాడు? అసలు ACP శివశంకర్ ఎవరు? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..!!!

కథ… కథనం విశ్లేషణ: లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ వుంది. ఎప్పుడూ యూత్ ను ఆకట్టుకునే పాత్రల్లో నటించిన యాంకర్ అనసూయ దర్జాలో ఓ పవర్ ఫుల్ విలన్ పాత్ర పోషించింది. ఈ పాత్రను హైలైట్ చేయటం కోసం దర్శకుడు ఎంచుకున్న స్టోరీ… దాని చుట్టూ రాసుకున్న స్క్రీన్ ప్లే ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. అనసూయ పాత్ర ఆది నుంచి చివరి దాకా ఎంతో క్రూరంగా సాగి ప్రేక్షకుల్లో మంచి క్యూరియాసిటీని పెంచుతుంది. అలాగే సునీల్ ఏసీపీ పాత్రలో వచ్చే ట్విస్ట్ లు ఆడియెన్స్ ని బాగా ఎంగేజ్ చేస్తాయి. ఓ వైపు బందర్ కనకం ఆగడాలను చూపిస్తూనే… మరో వైపు గణేష్, పుష్పాల స్వఛ్చమైన ప్రేమను… అలానే రంగ, తీన్ మార్ గీతల చిలిపి ప్రేమను, ఆమని, తన పిల్లల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్… శకలకశంకర్, థర్టీ ఇయర్స్ పృథ్వీల కామెడి అన్నీ మాస్ ను బాగ ఎంటర్టైన్ చేస్తాయి. చివర్లో వచ్చే మాస్ బీట్ సాంగ్ ఆడియెన్స్ ని అలరిస్తుంది.

అనసూయ పుష్పా తరవాత మంచి రౌద్రం వున్న పాత్రలో నటించి మెప్పించారు. విలనిజం తాలూకు పాత్రలో వచ్చే డైలాగ్స్ చాలా బాగా చెప్పింది. ACP శివశంకర్ పాత్రలో మాస్ ని మెప్పించేలా యాక్షన్ సీన్స్ తో మెప్పించాడు. ఈ చిత్రం కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవి పైడిపాటి డెబ్యూ అయినా… పోలీస్ పాత్రలో ఒదిగిపోయాడు. శమ్ము, అరుణ్ వర్మ అన్నదమ్ముల పాత్రల్లో లీనమై నటించారు. అలానే శిరీష, అక్సాఖాన్ అక్కా చెల్లెళ్ళుగా నటించి ఆకట్టుకున్నారు. చివర్లో ఆక్సాఖాన్ చేసిన మాస్ బీట్ సాంగ్ యూత్ ని ఉర్రూతలూగిస్తుంది. షకలక శంకర్, పృథ్వీ, పాల్ రాము బాగ నవ్వించారు. మహేష్ సిద్ధాంతిగా తన పాత్రకి న్యాయం చేశాడు. విలన్ గా బళ్ళారి పాత్రలో సమీర్ బాగా క్రూరంగా నటించి మెప్పించాడు.

దర్శకుడు సలీమ్ మాలిక్ రాసుకున్న కథ.. కథనాలు బాగున్నాయి. డెబ్యూ మూవీ ఆయినా బాగానే హ్యాండిల్ చేశాడు. డైలాగ్స్ బాగున్నాయి. సంగీతం పర్వాలేదు. చివర్లో వచ్చే మాస్ సాంగ్ ఆడియెన్స్ కి మాంచి కిక్ ఇస్తుంది. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా వుంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ బాగుంది. యాక్షన్ సీన్స్ మాస్ ను బాగ ఆకట్టు కుంటాయి. నిర్మాతలు ఖర్చుకి వెనుకాడకుండా సినిమాని క్వాలిటీగా నిర్మించారు. గో అండ్ వాచ్ ఇట్..!!!

రేటింగ్: 3/5

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

21న ఈ ఏడాదిలోనే అత్యంత పొడవైన పగలు.. ఎందుకలా జరుగుతుంది?

ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…

1 day ago

యుక్త వయసులో చేసే ఈ చిన్న తప్పులే.. పెద్దయ్యాక పెద్ద వ్యాధులకు కారణమవుతాయా?

చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…

1 day ago

ఎంత సంపాదించినా రూపాయి మిగలడం లేదా..? ఈ చిన్న అలవాట్లు మార్చుకుంటేనే ఆర్థిక భద్రత మీ సొంతం

ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…

1 day ago

కరివేపాకు రెండు రోజులకే నల్లబడిపోతుందా..? ఈ చిన్న చిట్కాలతో నెలరోజులైనా పచ్చగా, తాజాగా ఉంచుకోవచ్చు!

మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…

1 day ago

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ!

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

2 days ago

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

3 days ago