Anasuya: అనసూయ గత రెండు రోజులకు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పేరు ఈమె విజయ్ దేవరకొండను ఉద్దేశిస్తూ పరోక్షంగా చేసిన పోస్ట్ కారణంగా సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ అభిమానుల మధ్య అనసూయ మధ్య పెద్ద ఎత్తున వార్ నడుస్తుంది. విజయ్ దేవరకొండ తాజాగా నటిస్తున్న ఖుషి సినిమా నుంచి పోస్టర్ విడుదల కాగా అందులో ది విజయ్ దేవరకొండ అని ఉంది.
ఇది చూసిన అనసూయ పరోక్షంగా వామ్మో ది అంట ఈ పైత్యం మనకు అంటకుండా చూసుకోవాలి అంటూ కామెంట్ చేశారు. దీంతో విజయ్ దేవరకొండ అభిమానులు తమ హీరోని ఉద్దేశించి ఇలాంటి పోస్ట్ చేశారు అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఆమెని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు మరికొందరైతే నువ్వు కూడా ఆంటీ పక్కన ది అని పెట్టుకో ఎవరైనా వద్దన్నారా అంటూ మరోసారి అనసూయను ఆంటీ అంటూ ట్రోల్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే నేడు విజయ్ దేవరకొండ పుట్టినరోజు కావడంతో డైరెక్టర్ హరీష్ శంకర్ సోషల్ మీడియా వేదికగా విజయ్ దేవరకొండకు శుభాకాంక్షలు చెబుతూనే మరోవైపు యాంకర్ అనసూయకు కౌంటర్ ఇచ్చారని తెలుస్తోంది. ఇక హరీష్ శంకర్ సోషల్ మీడియా వేదికగా విజయ్ దేవరకొండకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ …
ది ది కామ్, ది హీరో, ది యాంగర్ కంట్రోల్ ఇలా ది అంటూ విషెస్ చెప్పాడు. అనసూయకు కౌంటర్లు వేయాలనే ఉద్దేశంలో విజయ్‌కి విషెస్ చెప్పాడో ఏమో గానీ.. విజయ్ ట్విట్టర్ హ్యాండిల్‌ని తప్పుగా ట్యాగ్ చేశాడు. దీంతో కావాలనే చేశావా? తెలిసే చేశావా? అంటూ విజయ్, ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే అనసూయకి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చావు అన్న అంటూ ఈ పోస్ట్ పై కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…