Anasuya: విజయ్ దేవరకొండ బర్త్ డే అనసూయకు కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్ హరీష్ శంకర్!

0
30

Anasuya: అనసూయ గత రెండు రోజులకు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పేరు ఈమె విజయ్ దేవరకొండను ఉద్దేశిస్తూ పరోక్షంగా చేసిన పోస్ట్ కారణంగా సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ అభిమానుల మధ్య అనసూయ మధ్య పెద్ద ఎత్తున వార్ నడుస్తుంది. విజయ్ దేవరకొండ తాజాగా నటిస్తున్న ఖుషి సినిమా నుంచి పోస్టర్ విడుదల కాగా అందులో ది విజయ్ దేవరకొండ అని ఉంది.

ఇది చూసిన అనసూయ పరోక్షంగా వామ్మో ది అంట ఈ పైత్యం మనకు అంటకుండా చూసుకోవాలి అంటూ కామెంట్ చేశారు. దీంతో విజయ్ దేవరకొండ అభిమానులు తమ హీరోని ఉద్దేశించి ఇలాంటి పోస్ట్ చేశారు అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఆమెని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు మరికొందరైతే నువ్వు కూడా ఆంటీ పక్కన ది అని పెట్టుకో ఎవరైనా వద్దన్నారా అంటూ మరోసారి అనసూయను ఆంటీ అంటూ ట్రోల్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే నేడు విజయ్ దేవరకొండ పుట్టినరోజు కావడంతో డైరెక్టర్ హరీష్ శంకర్ సోషల్ మీడియా వేదికగా విజయ్ దేవరకొండకు శుభాకాంక్షలు చెబుతూనే మరోవైపు యాంకర్ అనసూయకు కౌంటర్ ఇచ్చారని తెలుస్తోంది. ఇక హరీష్ శంకర్ సోషల్ మీడియా వేదికగా విజయ్ దేవరకొండకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ …

Anasuya: అనసూయకు గట్టి కౌంటర్ ఇచ్చాడుగా…


ది ది కామ్, ది హీరో, ది యాంగర్ కంట్రోల్ ఇలా ది అంటూ విషెస్ చెప్పాడు. అనసూయకు కౌంటర్లు వేయాలనే ఉద్దేశంలో విజయ్‌కి విషెస్ చెప్పాడో ఏమో గానీ.. విజయ్ ట్విట్టర్‌ హ్యాండిల్‌ని తప్పుగా ట్యాగ్ చేశాడు. దీంతో కావాలనే చేశావా? తెలిసే చేశావా? అంటూ విజయ్, ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే అనసూయకి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చావు అన్న అంటూ ఈ పోస్ట్ పై కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.