Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఆగస్టు 22వ తేదీ ఘనంగా తన 67వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా చిరంజీవి పుట్టిన రోజు కావడంతో ఈయనపుట్టినరోజు సందర్భంగా ఎంతో మంది సినీ సెలబ్రిటీలు కుటుంబ సభ్యులు అభిమానులు సోషల్ మీడియా వేదికగా చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇకపోతే రామ్ చరణ్ మాత్రం చిరంజీవి తన కుమార్తెను ఎత్తుకున్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ క్లీన్ కారా తరపున తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలా తన మనవరాలతో ఉన్నటువంటి ఫోటోని షేర్ చేయడంతో ఆ ఫోటోలలో చిరు ఎంతో సంతోషంలో ఉన్నారని ఆయన కళ్ళల్లోనే ఆనందం కనబడుతుంది.
ఇలా రామ్ చరణ్ చేసిన ఈ పోస్టును ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన మామయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.. అయితే చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ఈరోజు ఈయన రిప్లై ఇస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఉపాసన చేసిన ఈ పోస్టుకు చిరంజీవి రిప్లై ఇస్తూ చేసినటువంటి కామెంట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Chiranjeevi: ఈ పుట్టినరోజు ప్రత్యేకమైనది…
మన జీవితాల్లోకి క్లీంకారా రావడంతో ఈ బర్తడే నాకు మరింత విలువైనదిగా మారిపోయింది.. ప్రత్యేకమైనదిగా అనిపిస్తోంది. ఇక ఈ చిట్టి తల్లి రాకతో నేను ఇంకా యంగ్ గా అయిన ఫీలింగ్ వస్తోంది అంటూ చిరంజీవి తాను తాతను కాదు అన్నట్టుగా కౌంటర్ ఇస్తూ చేసినటువంటి ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇవి చూసినటువంటి మెగా ఫాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.



























