Vijay Devarakonda: ఫిలింఫేర్ అవార్డు అందుకున్న విజయ్ దేవరకొండ… అవార్డు అమ్ముకునే కష్టం ఏమొచ్చిందబ్బా!

0
27

Vijay Devarakonda: ఇండస్ట్రీలో రౌడీ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఎంతో మంచి గుర్తింపు పొందిన నటుడు విజయ్ దేవరకొండ లైగర్ సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు.టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి విజయ్ దేవరకొండ గత కొద్ది రోజులుగా వరుస ప్లాప్ సినిమాలను ఎదుర్కొంటున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా ఈయన ఖుషి సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు ఇదిలా ఉండగా నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి విజయ్ దేవరకొండ గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఎవరికి తెలియనటువంటి ఒక విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమాకు గాను బెస్ట్ యాక్టర్ ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. అయితే ఈయన మాత్రం ఈ అవార్డును వేలం పాటలో 25 లక్షల రూపాయలకు అమ్మేశారట. ఇలా ఇండస్ట్రీలో కొనసాగుతూ వచ్చే అవార్డులను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు కానీ విజయ్ దేవరకొండ మాత్రం 25 లక్షలకు అవార్డు అమ్మడంతో అంత అవసరం ఏమొచ్చిందని అందరూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.


Vijay Devarakonda: సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళం….

25 లక్షలకు అవార్డును వేలం పాటలో అమ్మి ఆ వచ్చిన డబ్బును సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళంగా ఇచ్చారట. ఆపత్కాలంలో ప్రజా సంక్షేమం కోసం ఈ డబ్బును ఉపయోగించే విధంగా ఈయన సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళంగా ఇచ్చారని తెలిసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలా రాష్ట్ర ప్రజల కోసం ఈయన ఈ డబ్బును విరాళంగా ఇవ్వడంతో ఈయన మంచి మనసు పై ప్రశంసలు కురిపిస్తున్నారు.