Nagachaitanya: సినిమా ఇండస్ట్రీలో నటుడుగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అక్కినేని నాగచైతన్య తాజాగా కస్టడీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా మే 12వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోని నాగచైతన్య వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమాని భారీగా ప్రమోట్ చేస్తున్నారు.

సాధారణంగా తన ఫ్యామిలీ విషయాలు వ్యక్తిగత విషయాల గురించి చర్చించని నాగచైతన్య కస్టడీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో కాస్త రూట్ మార్చినట్టు తెలుస్తుంది.ఈ సినిమా ప్రమోషన్లలో నాగచైతన్య తన వ్యక్తిగత విషయాల గురించి కూడా మాట్లాడుతున్నారు అలాగే సమంత పేరును పెద్ద ఎత్తున ఉపయోగిస్తూ సినిమాపై ఆసక్తి పెంచుతున్నారు.
ఇన్ని రోజులు విడాకుల గురించి మౌనం వహించిన నాగచైతన్య ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా విడాకులకు గల కారణాలను తెలియజేశారు. అంతేకాకుండా సమంత జ్ఞాపకాలను గౌరవిస్తానని తాను చాలా మంచి అమ్మాయి అంటూ చెప్పుకొస్తున్నారు. అలాగే తన ఫ్యామిలీ విషయాలను కూడా తెలియజేస్తున్నారు.

Nagachaitanya: గత సినిమా ఫలితాలను గుర్తు పెట్టుకోవాలి…
ఇక డైరెక్టర్ల గురించి కూడా ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా నాగచైతన్య కస్టడీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో కాస్త ఓవర్ చేస్తున్నారని అయితే ఇలా నాగచైతన్య అతిగా ప్రమోషన్ చేస్తే తన సినిమా ఫలితాలు ఎలా ఉంటాయో ఇదివరకు తాను చూసారని ఆ విషయాన్ని గుర్తు పెట్టుకుంటే మంచిది అంటూ కొందరు నాగచైతన్య ఇంటర్వ్యూల పై కామెంట్లు చేస్తున్నారు.