Ravikrishna: విరూపాక్ష సినిమాలో రవి కృష్ణ పాత్రకు ముందుగా అనుకున్న హీరో ఎవరో తెలుసా?

0
35

Ravikrishna: బుల్లితెర నటుడిగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రవి కృష్ణకు మొగలిరేకులు సీరియల్ సూపర్ సక్సెస్ అందించింది అని చెప్పాలి ఈ సీరియల్స్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రవికృష్ణ ఎన్నో బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇలా బుల్లితెర సీరియల్స్ లో కొనసాగుతున్నటువంటి ఈయనకు విరూపాక్ష సినిమాలో అవకాశం వచ్చింది.

విరూపాక్ష సినిమా ద్వారా రవికృష్ణ వెండి తెరపై అవకాశాలు అందుకోవడమే కాకుండా మొదటి సినిమాతోనే అద్భుతమైన నటనతో ఎంతో మంచి హిట్ అందుకున్నారు. ఇలా ఈ సినిమాలో రవి కృష్ణ పాత్రకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయని చెప్పాలి. ఇలా రవికృష్ణ నటించిన ఈ పాత్రకు ముందుగా వేరొక హీరోని అనుకున్నారట.

ఇదే విషయాన్ని స్వయంగా రవికృష్ణ ఓ సందర్భంలో వెల్లడించారు.ఈ సినిమా కోసం వేరొక హీరోని ఆడిషన్ చేయడమే కాకుండా ఆయనకు రెమ్యూనరేషన్ అంతా కూడా మాట్లాడారని అయితే చివరి క్షణంలో క్యాన్సిల్ కావడంతోనే నన్ను ఆడిషన్ కి పిలిచి ఈ సినిమాలో అవకాశం కల్పించారనీ రవికృష్ణ తెలిపారు. మరి రవి కృష్ణ పాత్రను వదులుకున్న ఆ హీరో ఎవరు అనే విషయానికి వస్తే…

Ravikrishna: అవకాశం వదులుకున్న కార్తీక్…


విరూపాక్ష సినిమాలో రవికృష్ణ పాత్రను వదులుకున్న వ్యక్తి మరెవరో కాదు కేరాఫ్ కంచరపాలెం సినిమా ద్వారా హీరోగా పరిచయమైనటువంటి కార్తీక్.ముందుగా ఈ పాత్రలో నటించే అవకాశం ఈయనకే వచ్చిందట అయితే చివరి నిమిషంలో తాను తప్పుకోవడంతో ఈ అవకాశం రవి కృష్ణకు వెళ్లిందని తెలుస్తోంది. ఏది ఏమైనా రవికృష్ణ ఈ సినిమాలో తన నటనతో మంచి మార్కులు కొట్టేశారు.