Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి పరిచయం అవసరం లేదు.ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి మహేష్ బాబు సాధారణంగా ఏదైనా కార్యక్రమాలు జరిగినా మహేష్ హాజరు కారు.

ఇండస్ట్రీకి సంబంధించిన వారి ఇళ్లల్లో ఏదైనా ఫంక్షన్లు జరిగిన ఇతర హీరోలు హాజరైన విధంగా మహేష్ బాబు హాజరు కారు.కేవలం తన ఫ్యామిలీ ఫంక్షన్లలో మాత్రమే మహేష్ బాబు కనపడుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా తప్పకుండా వెళ్లాల్సి ఉందన్న కార్యక్రమాలకు మాత్రమే యన హాజరవుతూ ఉంటారు. అయితే ఫంక్షన్లకు వచ్చినా కూడా వచ్చామా తన పని తను చూసుకున్నారా వెళ్ళామా అనే విధంగానే వ్యవహరిస్తూ ఉంటారు.
బయట ఏదైనా కార్యక్రమాలకు వచ్చినప్పటికీ ఈయన మాత్రం ఎలాంటి హంగు ఆర్భాటాలు చేయరు.చాలా సైలెంట్ గా ఉంటారు. అయితే మహేష్ బాబు ఇలా బయట ఫంక్షన్లకు రాకపోవడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే ఈయనకు ఉన్నటువంటి మొహమాటమే కారణమని తెలుస్తుంది. మహేష్ బాబు చాలా ఫ్రీగా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారట.

Mahesh Babu: మొహమాటం కారణమా…
ఇలా నలుగురిలోకి వచ్చి అందరితో కలిసి పోవడానికి ఆయన పెద్దగా ఇష్టపడరని అందుకే ఎలాంటి కార్యక్రమాలకు పెద్దగా హాజరు అవ్వడానికి ఆసక్తి చూపించరని తెలుస్తోంది. ఇక ఒకవేళ వచ్చిన ఇష్టంతో కాకుండా నమ్రత బలవంతం కారణంగానే వస్తారట. ఇలా మహేష్ బాబు మొహమాటం కారణంగానే ఫంక్షన్లకు దూరంగా ఉంటున్నారని చెప్పాలి.