Mehreen: ఐఏఎస్ ఆఫీసర్ తో పెళ్లికి సిద్ధమైన మెహరీన్ మాజీ ప్రియుడు… ఫోటోలు వైరల్!

0
22

Mehreen: కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైనటువంటి మెహరీన్ వరుస సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా మారిపోయారు. ఇలా ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మెహరీన్ ఈ మధ్యకాలంలో అవకాశాలను పూర్తిగా కోల్పోయారని తెలుస్తోంది.

ఈమె తాజాగా నటించిన ఎఫ్3 సినిమా సక్సెస్ అయినప్పటికీ అవకాశాలు మాత్రం అందుకోలేకపోతున్నారు. అలాగే అధిక శరీర బరువు ఉన్నటువంటి ఈమె పూర్తిగా శరీర బరువు తగ్గి చాలా అందంగా తయారయ్యారు. ఇలా ఈమె అవకాశాల కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న పెద్దగా అవకాశాలు మాత్రం రాలేదని చెప్పాలి. ఇకపోతే మెహరీన్ గతంలో హర్యానా మాజీ ముఖ్యమంత్రి బజన్ లాల్ మనవడు భవ్య బిష్ణోయ్ తో నిశ్చితార్థం జరుపుకున్న సంగతి తెలిసిందే.

వీరిద్దరి నిశ్చితార్థం జైపూర్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇక పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలోనే ఈమె తమ వివాహాన్ని రద్దు చేసుకుని తిరిగి సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇలా మెహరీన్ నిశ్చితార్థం,పెళ్లి క్యాన్సిల్ అవడానికి సరైన కారణాలు మాత్రం తెలియటం లేదు. అయితే ఈమె మాత్రం ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉండగా భవ్య బిష్ణోయ్ మాత్రం వైవాహిక బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు.


Mehreen: పరి బిష్ణోయ్ తో నిశ్చితార్థం..

భవ్య బిష్ణోయ్ హర్యానా బైపోల్ ఎన్నికలలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి భవ్య బిష్ణోయ్ ఐఏఎస్ అధికారిని పరి బిష్ణోయ్ ను వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోని వీరి నిశ్చితార్టానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.