Virupaksha: హీరోని డామినేట్ చేస్తుందన్న కారణంతోనే విరూపాక్ష సినిమా నుంచి ఆ హీరోయిన్ ని తప్పించారా?

0
45

Virupaksha: సాయిధరమ్ తేజ రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత మొదటిసారి విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇలా విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అద్భుతమైన హిట్ అందుకొని ఏకంగా 100 కోట్ల కలెక్షన్లను రాబట్టి రికార్డు సృష్టించారు. ఈ సినిమాలో సాయి ధరంతేజ్ సరసన నటి సంయుక్త మీనన్ నటించిన విషయం మనకు తెలిసిందే.

ఇక ఈ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అద్భుతమైన హిట్ అందుకొని అన్ని భాషలలో మంచి కలెక్షన్లను రాబట్టింది.ఇలా ఎంతో అద్భుతమైన ఈ సినిమా గురించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది నిజానికి ఈ సినిమాలో మొదటి ఛాయిస్ హీరోయిన్గా సంయుక్త మీనన్ కాదని తెలుస్తోంది. ఈ సినిమాలో ఫస్ట్ ఛాయిస్ నటి సాయి పల్లవి.

ముందుగా ఈ సినిమాలో హీరోయిన్గా నటి సాయి పల్లవిని తీసుకోవాలని భావించారట అయితే సాయి పల్లవి ఇండస్ట్రీలో చాలా క్రేజీ హీరోయిన్.ఈమె అద్భుతమైన నటనతో నాట్యంతో హీరోలను డామినేట్ చేస్తూ కనిపిస్తారు ఈ తరుణంలోని ఈ సినిమాలో కూడా సాయి పల్లవిని తీసుకుంటే హీరో పాత్రను డామినేట్ చేస్తుందని భావించారట.

Virupaksha: సాయి పల్లవి అయితే మరో లెవెల్ లో ఉండేది…


ఇలా హీరో క్యారెక్టర్ ను డామినేట్ చేసే విధంగా సాయి పల్లవి ఉంటుందనీ భావించిన నిర్మాతలు ఈ సినిమాలో సాయి పల్లవి స్థానంలో నటి సంయుక్త మీనన్ ను ఎంపిక చేసినట్టు సమాచారం.ఒకవేళ ఈ సినిమాలో కనుక సంయుక్త బదులు సాయి పల్లవి కనుక నటించి ఉంటే సినిమా మరో రేంజ్ లో ఉండేదని నేటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.