Virupaksha Movie: సుప్రీం హీరో సాయిధరమ్ తేజ నటించిన విరూపాక్ష సినిమా ఇటీవల విడుదలై మంచి హిట్ అందుకున్న సంగతి అందరికీ తెలిసిందే. యువ దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొని సక్సెస్ ఫుల్ గా ముందుకి దూసుకుపోతోంది. ప్రమాదం తర్వాత సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోలుకొని ఈ సినిమాలో నటించాడు.

అసలు భవిష్యత్తులో సినిమాలలో నటిస్తానా? లేదా? అన్న అనుమానంతో ఉన్న సాయిధరమ్ తేజ్ ఈ సినిమాలో నటించి హిట్ కొట్టాడు. ఈ సినిమా హిట్ అవ్వడంతో సాయిధరమ్ తేజ్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా క్లైమాక్స్ లో సీక్వెల్ గురించి ఒక చిన్న హింట్ ఇచ్చారు. దీంతో విరూపాక్ష సీక్వెల్ గురించి అభిమానులు అడిగిన ప్రశ్నలకు సాయిధరమ్ తేజ్ ఆసక్తికర సమాధానం చెప్పాడు.
ఈ క్రమంలో తాజాగా #AskSDT పేరుతో అభిమానులతో ముచ్చటించిన సాయి ధరమ్ తేజ్ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాడు.ఈ క్రమంలో ఓ నెటిజన్.. ఇంతకు “విరూపాక్ష మూవీ క్లైమాక్స్ లో చిన్న హింట్ ఇచ్చారు కదా.. మరి ఈ సినిమా సీక్వెల్ ఉంటుందా..? ఒకవేళ పార్ట్ 2 ఉంటే మన ఫ్యాన్స్ కి పండుగే” అని ట్వీట్ చేశాడు.
నెటిజన్ అడిగిన ఈ ప్రశ్నకు సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ.. ‘ సీక్వెల్ ఉంటుంది అని క్లైమాక్స్‌లో చిన్న హింట్ ఇచ్చాం కదా” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Virupaksha Movie: సీక్వెల్ ఉంటుంది కానీ…
ఇక ‘విరూపాక్ష’ సీక్వెల్‌పై దర్శకుడు కార్తీక్ దండు ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. ఇటీవల ఓ చానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న కార్తీక్ ని ‘ విరూపాక్ష సీక్వెల్ ఉంటుందా అని ప్రశ్నించగా..ఇప్పటి వరకైతే… సీక్వెల్ గురించి నేను ఎలాంటి ఆలోచన చేయలేదు. కానీ నేను, సుకుమార్ ప్లాన్ చేస్తున్నాం. తప్పకుండా విరూపాక్ష సీక్వెల్ ఉంటుంది.. కాకపోతే వెంటనే రాకపోవచ్చు’’ అని కార్తిక్ సమధానం చెప్పాడు. మొత్తానికి విరూపాక్ష సీక్వెల్ గురించి క్లారిటీ రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
#Virupaksha Movie Climax Lo Chinna Hint Icharu Part2 Untundha @IamSaiDharamTej Anna Okavela Part2 Unte Mana Fan’s Ki Panduge Anna#AskSDT #BlockBusterVirupaksha pic.twitter.com/yvDJsxxnej
— Pavan Kalyan Mbs (@MbsPavanJsp) April 24, 2023
































