Ravikrishna: బుల్లితెరపై నటీనటులుగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నటువంటి వారిలో నటి నవ్య స్వామి అలాగే నటుడు రమ్యకృష్ణ ఎంతో ఫాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.వీరిద్దరికీ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడమే కాకుండా ఈ జోడి కి ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి.ఇలా బుల్లితెర సీరియల్స్ ద్వారా వీరిద్దరూ పెద్ద ఎత్తున సందడి చేయడంతో వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చూసి నిజంగానే ప్రేమలో ఉన్నారని అందరూ భావిస్తున్నారు.

ఇలా వీరిద్దరి గురించి ఇప్పటికే ఎన్నో రకాల వార్తలు వచ్చాయి.వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అయితే వీరి ప్రేమ విషయాన్ని దాస్తున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి.ఇకపోతే రవికృష్ణ ఏకంగా వెండితెర సినిమా అవకాశాలను కూడా అందుకుంటున్న విషయం మనకు తెలిసిందే. తాజాగా ఈయన విరూపాక్ష సినిమాలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రవి కృష్ణకు నవ్య స్వామి గురించి తనతో రిలేషన్ లో ఉన్నారు అంటూ వచ్చే వార్తలు గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు రవికృష్ణ సమాధానం చెబుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా నవ్య స్వామి గురించి రవి కృష్ణ మాట్లాడుతూ.. నవ్య నాకు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ అని తెలియజేశారు. మా ఇద్దరి మధ్య మీరు అనుకున్న రిలేషన్ లేదని తెలిపారు.

Ravikrishna: లవ్ ప్రపోజల్ వస్తే ఆలోచిస్తా…
ప్రస్తుతానికి ఇద్దరం మంచి స్నేహితులమని రవికృష్ణ తెలిపారు. ఒకవేళ భవిష్యత్తులో నవ్య స్వామి నుంచి తనకు కనుక లవ్ ప్రపోజల్ వస్తే అప్పుడు ఆలోచిస్తాను అంటూ ఈ సందర్భంగా నవ్య స్వామితో రిలేషన్ గురించి వస్తున్నటువంటి వార్తలపై రవికృష్ణ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.