Samyuktha Menon: భీమ్లా నాయక్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్. ఇలా ఈ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె అనంతరం పలు సినిమాలలో నటించే అవకాశాలను అందుకొని వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. తాజాగా ఈమె విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇలా విరూపాక్ష సినిమా ద్వారా మరో హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక సంయుక్త మీనన్ ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇలా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి ఈమె వరస సినిమాలలో నటిస్తూ భారీగానే ఆస్తులు కూడా పెట్టారని తెలుస్తోంది. ఈమె స్వస్థలంలో ఎంతో ఖరీదైన ఇల్లు ఉందని తెలుస్తుంది.

Samyuktha Menon: కోట్లు విలువచేసే ఇల్లు…
అలాగే హైదరాబాదులో రీసెంట్ గా ఈమె మరొక అపార్ట్మెంట్ కూడా కొనుగోలు చేశారని సమాచారం. ఇలా హైదరాబాదులో అపార్ట్మెంట్ తో పాటు 80 లక్షల విలువచేసే మెర్సిడెస్ బెంజ్ కొనుగోలు చేశారని తెలుస్తుంది.ఇలా ఈమె ఆస్తులన్నీ కలిపి సుమారు పది లక్షల వరకు విలువ చేస్తాయని సమాచారం. ఇలా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఈమె పది కోట్ల రూపాయల ఆస్తులు కూడ పెట్టారని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
































