Ramcharan: నేడు మెగాస్టార్ చిరంజీవి తన 67వ పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది సినీ సెలెబ్రెటీలు అభిమానులు ఈయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చేసినటువంటి పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా రాంచరణ్ సైతం తన కుమార్తె తరఫున చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఉపాసన రాంచరణ్ కుమార్తె క్లీన్ కార తరపున రాంచరణ్ సోషల్ మీడియా వేదికగా చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చిరంజీవి తన మనవరాలిని ఎత్తుకొని ఆడిస్తున్నటువంటి ఫోటోలను రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. హ్యాపీయేస్ట్ బర్తడే టు అవర్ డియరెస్ట్ చిరుత (చిరు తాత) మా, కొణిదెల ఫ్యామిలీలోకి అడుగుపెట్టిన కొత్త మెంబర్ నుంచి బోలెడంత లవ్ అంటూ రామ్ చరణ్ తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని తెలిపారు.
ఈ విధంగా రాంచరణ్ తన కూతురి తరుపున తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ షేర్ చేసినటువంటి ఈ ఫోటోలు వైరల్ కావడంతో మెగా ఫాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక నేడు చిరంజీవి పుట్టినరోజు కావడంతో ఆయన తదుపరి సినిమాలకు సంబంధించిన వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ అభిమానులను సంతోషానికి గురి చేస్తున్నారు.

Ramcharan: తాతయ్యతో ఆడుకుంటున్న క్లీన్ కారా…
ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హీరోలైన ఎన్టీఆర్ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఇటువంటి వారందరూ కూడా సోషల్ మీడియా వేదిక చిరంజీవికి స్పెషల్ విషెస్ తెలియజేస్తున్నారు. ప్రస్తుత సోషల్ మీడియాలో చిరంజీవి పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన పోస్టులు ఆయన రేర్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.