Movie News

Anasuya: అనసూయను మళ్లీ గెలికిన విజయ్ ఫ్యాన్స్… యానిమల్ సినిమా బోల్డ్ సీన్స్ పై ట్రోల్స్!

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె ప్రస్తుతం సినిమా అవకాశాలను అందుకొని వెండితెరపై నటిగా కొనసాగుతూ బిజీగా ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉండే అనసూయ తాజాగా చీరకట్టులో ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేశారు. ఇక ఈ ఫోటోలలో ఈమె ఎంతో అందంగా అందరినీ ఆకట్టుకుంటున్నారు అయితే ఈ ఫోటోలపై విజయ్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తూ మరోసారి ఈమెను గెలికారు.

విజయ్ దేవరకొండ అనసూయ అభిమానుల మధ్య నిత్యం వార్ నడుస్తూనే ఉంటుంది. ఈయన నటించిన అర్జున్ రెడ్డి సినిమా సమయంలో ఆ సినిమా పట్ల అనసూయ చేసినటువంటి కామెంట్స్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయని చెప్పాలి. ఈ విషయంపై తరచూ ఈమె ట్రోల్స్ ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ సినిమాకు సందీప్ రెడ్డి డైరెక్టర్గా వ్యవహరించారు అయితే తాజాగా సందీప్ రెడ్డి డైరెక్షన్లో యానిమల్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

రణబీర్ కపూర్ రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది అయితే ఈ సినిమాలో కొన్ని బోల్డ్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఈ విషయాల గురించి అభిమానులు అనసూయ పట్ల ట్రోల్స్ చేస్తున్నారు. అర్జున్ రెడ్డి సినిమా సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అనసూయ యానిమల్ సమయంలో సైలెంట్ గా ఉన్నారు.

యానిమల్ సినిమా చూడలేదా..

ఈ విషయంపై విజయ్ ఫ్యాన్స్ స్పందిస్తూ ఏంటి అనసూయ యానిమల్ సినిమా చూడలేదా.. ఈ సినిమాలో బోల్డ్ సన్నివేశాలపై ఎందుకు స్పందించడం లేదు అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి కొందరు మాత్రం ఈమె కేవలం విజయ్ సినిమాలను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా మరోసారి అనసూయ పట్ల విజయ ఫ్యాన్స్ చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago