Nani: నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్నటువంటి తాజా చిత్రం హాయ్ నాన్న. ఈ సినిమా డిసెంబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా గత కొద్ది రోజుల క్రితం వైజాగ్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించుట సంగతి మనకు తెలిసిందే.
ఇక ఈ వేడుకలలో భాగంగా నిర్వాహకుల అత్యుత్సాహం కారణంగా భారీ స్థాయిలో చిత్రబృందం ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా కొందరు సినీ సెలబ్రిటీల ఫోటోలను స్క్రీన్ పై డిస్ ప్లే చేశారు. ఇలా కొన్ని సినీ జంటల ఫోటోలను స్క్రీన్ పై వేస్తూ వారి గురించి చిత్ర బృందాన్ని కొన్ని ప్రశ్నలు వేశారు. ఈ క్రమంలోనే రష్మిక విజయ్ దేవరకొండ స్విమ్మింగ్ పూల్ లో సేదతీరుతో ఉన్నటువంటి ఫోటోని స్క్రీన్ పై చూపించడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు.
ఇక ఈ ఫోటోని అలా చూపించడంతో విజయ్ దేవరకొండ అభిమానులు కూడా సినిమా ప్రమోషన్ల కోసం ఎలాంటి చీప్ ట్రిక్స్ అవసరమా అంటూ కూడా ట్రోల్స్ చేస్తున్నారు. ఇక ఈ విషయం గురించి మరొక ఇంటర్వ్యూ సందర్భంగా నానికి ప్రశ్నలు ఎదురయ్యాయి ఈ విషయంపై నాని స్పందిస్తూ ఇలా స్క్రీన్ పై విజయ్ దేవరకొండ రష్మిక ఫోటోలు రావడంతో మేము కూడా ఒక్కసారిగా షాక్ అయ్యామని తెలియజేశారు.
బాధపడి ఉంటే క్షమించండి..
ఇలా సినిమా ప్రమోషన్లలో కొన్నిసార్లు అనుకోకుండా ఇలాంటివి జరుగుతాయని విజయ్ రష్మికకు కూడా తెలుసు. మేమంతా మంచి స్నేహితులమని ఈయన తెలియజేశారు. అయితే ఈ ఫోటో ఇలా స్క్రీన్ పై డిస్ప్లే కావటం వల్ల ఎవరైనా బాధపడి ఉంటే వారికి నా నుంచి అలాగే హాయ్ నాన్న టీం నుంచి కూడా క్షమాపణలు చెబుతున్నాను అంటూ ఈ సందర్భంగా నాని అందరికీ క్షమాపణలు తెలియజేశారు.
హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా తగ్గుదల దిశగా…
కాకినాడ జిల్లాలోని తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత ఉత్కంఠ రేపుతోంది.…
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…