Categories: FeaturedMovie News

Anasuya Sister: చెల్లిని యాంకర్ గా పరిచయం చేయనున్న అనసూయ.. అక్కలేని లోటును తీర్చనున్న వైష్ణవి!

Anasuya Sister: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో గ్లామరస్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఒకరు. ఈమె ఇండస్ట్రీకి యాంకర్ గా పరిచయం కానంతవరకు యాంకర్ అంటే ఎంతో హుందాగా ఒంటినిండా దుస్తులు వేసుకొని కనిపించేవారు. అయితే అనసూయ యాంకర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన తర్వాత గ్లామర్ షో చేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఈ విధంగా జబర్దస్తీ యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయకు రోజు రోజుకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.ఇలా ఈమెకు వచ్చిన పాపులారిటీతో బుల్లితెర అవకాశాలు మాత్రమే కాకుండా వెండితెర అవకాశాలను కూడా అందుకున్నారు.ఇలా వరుస వెండితెర సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉండడంతో ఈమె పూర్తిగా బుల్లితెరకు గుడ్ బై చెప్పి వెండితెరపై సందడి చేస్తున్నారు.

ఇక అనసూయ యాంకర్ గా బుల్లితెర కార్యక్రమాలకు దూరం కావడంతో ఈమె లేని లోటు స్పష్టంగా కనబడుతుంది.అయితే అనసూయ తన స్థానాన్ని భర్తీ చేయడం కోసం తన చెల్లెలు వైష్ణవినీ రంగంలోకి దింపుతుందని తెలుస్తోంది. అనసూయకు ఇద్దరు చెల్లెలు ఉన్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే అచ్చం అనసూయ పోలికలతో ఉన్నటువంటి తన సోదరి వైష్ణవిని యాంకర్ గా ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.

Anasuya Sister: జీ తెలుగులో సందడి చేయనున్న వైష్ణవి..

జీ తెలుగులో త్వరలోనే ప్రారంభం కాబోతున్న ఓ కొత్త కార్యక్రమానికి యాంకర్ గా వైష్ణవి పరిచయం కానున్నారట. ఈ క్రమంలోనే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అనసూయ లేని లోటును వైష్ణవి తీర్చబోతున్నారని,ఇకపై బుల్లితెర కార్యక్రమాలలో వైష్ణవి హవా కొనసాగుతుందని పెద్ద ఎత్తున అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్టు సమాచారం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago