Chalaki Chanti : సినిమాల్లో కంటే జబర్దస్త్ ద్వారా బాగా ఫేమస్ అయిన చంటి చలాకి చంటి గా అందరికీ సుపరిచితుడు. ఈటీవీ జబర్దస్త్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న చంటి ఆ తరువాత ‘నాషో నా ఇష్టం’ ప్రోగ్రామ్ కూడా మంచి సక్సెస్ అందుకుంది. సినిమాల్లోనూ మంచి అవకాశాలతో కెరీర్ బాగున్నపుడే చంటి జబర్దస్త్ వదిలి వెళ్ళిపోయాడు. అలా రావడం పోవడం వల్ల చంటి గ్రాఫ్ బాగా తగ్గింది జబర్దస్త్ లో. ఇక ఇటీవల మళ్ళీ జబర్దస్త్ లో కనిపిస్తున్న చంటి తాజాగా బిగ్ బాస్ ఆఫర్ వల్ల జబర్దస్త్ వదిలేసాడు. బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ గా వెళ్లిన చంటి అక్కడ గేమ్ ఆడలేక ఐదో వారం బయటికి వచ్చేసానని, రియాలిటీ షోలో రియాలిటీ లేదంటూ ఆరోపింస్తూ తాజాగా యూట్యూబ్ సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.
జబర్దస్త్ నుండి ఎటువంటి సపోర్ట్ లేదు…
ఇక బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసిన చంటికి జబర్దస్త్ వాళ్ళ దగ్గరి నుండి సోషల్ మీడియా నుండి కానీ ఇంటర్వ్యూల్లో కానీ ఎటువంటి మద్దతు లభించక పోవడం ఆశ్చర్యరంగా అనిపించింది అంటూ, యాంకర్ రోషన్ అడిగిన ప్రశ్నకు చంటి మాట్లాడుతూ జబర్దస్త్ లో నా అనుకున్న వాళ్ళు నన్ను మోసం చేశారు, కొంతమంది చిన్న చిన్న సహాయాలు చేశారు. కానీ కొంతమంది నేను చాలా నమ్మిన వాళ్లు నన్ను మోసం చేశారు. వెళ్ళాడు బిగ్ బాస్ కి వచ్చేస్తాడు అన్నట్లుగా మాట్లాడారు అంటూ చెప్పాడు. ఇక సమయం వచ్చినపుడు వాళ్లను ప్రూఫ్స్ తో సహా ఎందుకు ఇలా చేసావ్ అని అడుగుతా అంటూ చంటి చెప్పాడు.
ఇక బిగ్ బాస్ లో గీతూ, రేవంత్, కీర్తి అంటే నచ్చని చంటి వారి గురించి మాట్లాడటానికి ఇష్టపడలేదు. గీతూ గురించి మాట్లాడుతూ తాను చేసింది మొదటి వారం లో తప్పు అని చెప్పినందుకు అప్పటి నుండి మా మధ్య గ్యాప్ వచ్చింది, బిగ్ బాస్ లో రియల్ గా ఉంటే ఇలానే బయటికి వచ్చేస్తారు అంటూ చెప్పాడు చంటి. ఇక రేవంత్, కీర్తి గురించి అడిగే సరికి నేను మాట్లాడను వారి గురించి అని చెప్పి ఎందుకు అవే ప్రశ్నలు వేస్తున్నావ్ అంటూ యాంకర్ రోషన్ మీద ఫైర్ అయి షో నుండి వెళ్ళిపోయాడు చంటి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…